వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2021-01-16T05:55:21+05:30 IST

వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం

వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం
కొవిడ్‌ వ్యాక్సిన్లను పరిశీలిస్తున్న డాక్టర్‌ దామోదర్‌

ఆమనగల్లు/షాద్‌నగర్‌అర్బన్‌/మొయినాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ శుక్రవారం మధ్యాహ్నం ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రికి చేరుకుంది. హైదరాబాద్‌ నుంచి పోలీసు భద్రత నడుమ ప్రత్యేక వాహనంలో వైద్య బృందం వ్యాక్సిన్‌ను ఆమనగల్లుకు తీసుకువచ్చారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో దీన్‌దయాల్‌ పర్యవేక్షణలో తహసీల్దార్‌ చందర్‌రావు, ఎస్‌ఐ ధర్మేష్‌, వైద్యులు ప్రభాకర్‌, జయశ్రీ, రవికుమార్‌, ఫాతీమా, శ్రీకాంత్‌, ఎంపీహెచ్‌ఈవో తిరుపతిరెడ్డి వ్యాక్సిన్‌ను అసుపత్రిలో భద్రపరిచారు. 264 మంది ఆన్‌లైన్‌లో వ్యాక్సిన్‌కు రిజిస్ర్టేషన్‌ చేయించుకోగా 210 డోసులు వచ్చాయని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు వ్యాక్సినేషన్‌ పారంభించి తోలి రోజు ఆశా, వైద్య, అంగన్‌వాడీ సిబ్బంది నుంచి ఎంపిక చేసిన 30 మందికి వ్యాక్సిన్‌ వేయనున్నట్లు వారు వెల్లడించారు. షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రి క్వార్టర్స్‌లో శనివారం ఉదయం 10.30 గంటలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించేందుకు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ దామోదర్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు 30మంది ప్రభుత్వ వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు దామోదర్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారు తిరిగి 25 రోజులకు రెండో డోస్‌ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మొయినాబాద్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ చేరుకుంది. 160 డోసులు రాగా శుక్రవారం మండల వైద్యాధికారి డాక్టర్‌ రోహిణి వ్యాక్సిన్లను భద్రపరిచారు. 

Updated Date - 2021-01-16T05:55:21+05:30 IST