పన్ను చెల్లింపుదారులకు ఊరట

ABN , First Publish Date - 2020-04-09T01:22:03+05:30 IST

కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది.

పన్ను చెల్లింపుదారులకు ఊరట

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. పెండింగ్‌లో ఉన్న అన్ని ఆదాయపు పన్ను వెంటనే తిరిగి చెల్లించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రూ. 5 లక్షల వరకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పెండింగ్‌లో ఉన్న అన్ని జీఎస్టీ, కస్టమ్ రీఫండ్ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. లక్ష మంది వ్యాపారులకు లబ్ది చేకూరుస్తుందని, మొత్తం రీఫండ్ రూ .18,000 కోట్లు ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 


కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేసే సూచనలు కనిపించడం లేదని ప్రధాని మోదీ సూచించారు. రాష్ట్రాల సీఎంల సూచనలు, అఖిలపక్ష నేతలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం లాక్‌డౌన్ ఎత్తివేత సాధ్యంకాకపోవచ్చని వెల్లడించారు.



Updated Date - 2020-04-09T01:22:03+05:30 IST