పాయల్ రాజ్‌పుత్ ఆశలన్నీ అక్కడే..!

'ఆర్.ఎక్స్ 100' బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఆశలన్నీ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీపైనే పెట్టుకుందట. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటించిన 'ఆర్.ఎక్స్ 100' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో తనకి వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే, అన్నీ 'ఆర్.ఎక్స్ 100' మూవీ తరహాలోనే ఉన్నాయనే కారణంతో రిజెక్ట్ చేసింది. 'ఆర్డీఎక్స్ లవ్', 'వెంకీ మామా', 'డిస్కోరాజా' లాంటి సినిమాలు చేసిన పాయల్.. స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. మధ్యలో ఓ ఐటెం సాంగ్ చేసినా.. అమ్మడికి అది అంతగా కలిసి రాలేదు. ప్రస్తుతం తెలుగులో ఆది సాయి కుమార్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఇక్కడ అంతగా అవకాశాలు దక్కకపోవడంతో కన్నడ సినిమా ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది పాయల్. అక్కడ ధనంజయ హీరోగా తెరకెక్కుతున్న జయరాజ్ బయోపిక్ 'హెడ్ బుష్'లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు తన ఆశలన్నీ ఈ బయోపిక్ మూవీపైనే ఉన్నాయి. చూడాలి మరి కన్నడ ఇండస్ట్రీలోనైనా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంటుందా లేదా. 

Advertisement