Abn logo
Sep 24 2021 @ 22:43PM

హద్దు మీరుతున్న అధికారపార్టీ దోపిడీ

కబ్జాకు గురైన మందాటి చెరువును పరిశీలిస్తున్న అఖిలపక్షం నేతలు

వాటాలతో సరిపెట్టుకుంటున్న అధికారులు

కావలి, సెప్టెంబరు 24: కావలి నియోజకవర్గంలో ఇసుక, మట్టి, చెరువులు, గుంటలు వాగులు, వంకలు, అక్రమ లేఅవుట్లు ఒకటేమిటి అవకాశం ఉన్నంత వరకు అధికారపార్టీ నేతలు దేనిని వదలకుండా దోపిడీ చేస్తున్నారని అఖిలపక్షం నేతలు ఆరోపించారు. కబ్జాకు గురైన మందాటి చెరువును శుక్రవారం అఖిలపక్ష నేతలు చింతాల వెంకట్రావు, దామా అంకయ్య, జ్యోతిబాబూరావు, కరువాది భాస్కర్‌, డేగా సత్యం, చేవూరు కొండయ్యలు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికారుపార్టీ దోపిడీలు హెచ్చు మీరుతున్నా అధికారులు తమ దృష్టికి రాలేదని తప్పించుకోవటం చూస్తే ఆ దోపిడీలలో వారికి కూడా వాటా ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయన్నారు. అవసరమైతే న్యాయస్థానాలను అయినా ఆశ్రయించి దోపిడీకి అడ్డుకట్ట వేసే వరకు పోరాడుతామని చెప్పారు.