Advertisement
Advertisement
Abn logo
Advertisement

పార్టీ శ్రేణులంతా సైనికులవలే పనిచేయాలి

నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ


బాపట్ల: తెలుగుదేశంపార్టీ శ్రేణులంతా సైనికులవలే పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని తెలుగుదేశంపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వేగేశన నరేంద్రవర్మ పిలుపునిచ్చారు. బాపట్ల మండలం పాండురంగాపురంలో ఆదివారం సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి నరేంద్రవర్మ అధ్యక్షత వహించి మాట్లాడుతూ రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేయాలని తీర్మానించారు. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా ప్రజలకు నివేశన స్థలాల పట్టాలు, పక్కాగృహాలు నిర్మించే విషయంలో జరుగుతు న్న లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. వైసీపీ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేస్తాం అని చెప్పి జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ను విడుదల చేసిందని తద్వారా యువతను మోసం చేస్తున్నారన్నారు. నిత్యావసర వస్తు వుల ధరలు విపరీతంగా పెరిగాయని వాటిని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. బాపట్ల పార్ల మెంట్‌ స్థాయిలో నియోజకవర్గం నుంచి ఏడుగురికి పదవులు రావటంపై అభినందనలు తెలిపారు. నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంను దాత మువ్వా సుబ్బారావు ఇచ్చిన స్థలంలోనే నిర్మించాలని తీర్మానించారు. కార్య క్రమంలో సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్‌ నారాయణ, రాష్ట్ర కార్యదర్శి సల గల రాజశేఖర్‌బాబు, మాజీ ఎంపీపీ మానం విజేత, పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు పల్లం సరోజనీ, పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రధానకార్యదర్శి తానికొండ దయాబాబు, పంగులూరి శ్రీనివాసరావు, ఆట్ల బాలాజిరెడ్డి పాల్గొన్నారు.


టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీనాయకులు 

వేగేశన నరేంద్రవర్మ ఆధ్వర్యంలో పిట్టలవానిపాలెం మండలం కోమలి, భవనవారిపాలెం గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు ఆదివారం తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి నరేంద్రవర్మ ఆహ్వానించారు. 

Advertisement
Advertisement