Abn logo
Sep 26 2021 @ 00:40AM

అన్నీ కొత్త ముఖాలే..!

ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎంపీటీసీ సభ్యులు (ఫైల్‌ఫొటో)

కొంగొత్తగా మండల పరిషత్‌ పాలకవర్గం

19 మంది ఎంపీటీసీలూ తొలిసారి గెలిచినవారే!

కోఆప్షన్‌ సభ్యుడూ మొదటిసారి ఎన్నిక


బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 25: మండల పరిషత్‌ పాలకవర్గంలో ఈసారి అన్నీ కొత్త ముఖాలే కనిపిస్తున్నాయి. ఎంపీటీసీ సభ్యులంతా మొదటిసారి ఎన్నికైన వారే. దీంతో మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు కోఆప్షన్‌ సభ్యుడు కూడా మండల పరిషత్‌ పాలకవర్గంలోకి తొలిసారి అడుగు పెట్టారు.

మండలంలోని 19 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 11 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు విజయం సాధించారు. వీరంతా గతంలో ఎంపీటీసీ పదవులు చేపట్టలేదు. అలాగే ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులు మహిళలకు దక్కాయి. పెదమదీన వైసీపీ అభ్యర్థిని కొల్లిమళ్ల లలిత రాము, వైస్‌ ఎంపీపీ అభ్యర్థి గొలగాని శ్రీనివాస్‌యాదవ్‌ ఎన్నికల్లో ఓటమి చెందడంతో, చింతపాక ఎంపీటీసీ దాకవరపు నాగేశ్వరిదేవిని అనూహ్యంగా ఎంపీపీ, వడ్డాది-3 ఎంపీటీసీ దొండా లలితకు వైస్‌ ఎంపీపీ పదవులు వరించాయి. ఓటమి చెందిన ఎంపీపీ అభ్యర్థి లలిత రాము భర్త కొల్లిమళ్ల అచ్చెంనాయుడుకు మైనార్టీ విభాగంలో కోఆప్షన్‌ సభ్యుడిగా తొలిసారి మండల పరిషత్‌లో అడుగుపెట్టడం గమనార్హం. ఏదేమైనా ఈసారి పాలకవర్గం మొత్తం తొలిసారి కొలువుదీరడం విశేషం.