నా కథలన్నీ తీయటి అబద్ధాలు!

ABN , First Publish Date - 2022-08-17T07:43:30+05:30 IST

నా కథలన్నీ తీయటి అబద్ధాలు!

నా కథలన్నీ తీయటి అబద్ధాలు!

త్వరలో ఆర్‌ఎస్ఎస్ పై చిత్రం, వెబ్‌సీరిస్‌

‘ది హిందుత్వ పారడైం’ పుస్తకావిష్కరణలో ఎంపీ విజయేంద్రప్రసాద్‌

విజయవాడ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ‘‘నేను రాసే కథలు తీయటి అబద్ధాలు. విన్న కథలన్నీ నిజం కావు. కొన్ని కథలు మత్రం నిజమవుతాయి’’ అని సినీ కథా రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌ అన్నారు. సాహితీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ‘ది హిందుత్వ పారడైం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో మంగళవారం రాత్రి జరిగింది. పుస్తకావిష్కరణ అనంతరం విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ.. నాలుగేళ్ల కిత్రం ఆర్‌ఎ్‌సఎస్‌ మీద కథ రాయమని అడిగినప్పుడు అందుకోసం తాను నాగపూర్‌ వెళ్లాననాన్నరు. అప్పటి వరకు స్వయం సేవక్‌ గురించి పెద్దగా తెలియదని, గాంధీజీని స్వయం సేవక్‌ చంపిందన్న భావనలో ఉన్నానని చెప్పారు. స్వయం సేవక్‌ సంఘ్‌ లేకపోతే కశ్మీర్‌ ఉండేది కాదని, ఎప్పుడో పాకిస్థాన్‌ వశమయ్యేదన్నారు. స్వయం సేవక్‌ గురించి తెలుసుకుని పరిపూర్ణమైన పశ్చాత్తాపం చెందానన్నారు. స్వయం సేవక్‌పై కథ రాసి మోహన్‌ భగవత్‌కు చూపిస్తే ఆయన ఎంతో పొంగిపోయారని చెప్పారు. స్వయం సేవక్‌పై రాసిన కథను త్వరలోనే చిత్రం, వెబ్‌సీరి్‌సగా రూపొందిస్తానని ప్రకటించారు. ఆర్‌ఎ్‌సఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామ్‌మాధవ్‌ మాట్లాడుతూ.. బ్రిటిష్‌ వాళ్లను దేశం నుంచి పంపడం ఒక్కటే స్వాతంత్రోద్యమం కాదన్నారు. బ్రిటన్‌ కంటే భారతదేశ ప్రజాస్వామ్యం గొప్పదని నిరూపించుకోగలిగామన్నారు. అధికారంలో ఉన్న వారు ఎక్కడ కావాలంటే అక్కడ రాజధానులు ఏర్పాటు చేసుకోవడం ప్రజాస్వామ్యం కాదని జగన్‌ ప్రభుత్వంపై పరోక్షంగా మండిపడ్డారు.

Updated Date - 2022-08-17T07:43:30+05:30 IST