కర్ణాటక రాష్ట్ర మంత్రి ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలోని ముస్లింలు, క్రిస్టియన్లందరూ భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఆర్ఎస్ఎస్తో అనుబంధం పెంచుకుంటారని కర్ణాటక మంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప గురువారం అన్నారు.శాసనసభలో జరిగిన చర్చలో స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి ‘‘మా ఆర్ఎస్ఎస్’’ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు ప్రతిపక్ష శాసనసభ్యులు కూడా అదే చెప్పే రోజు వస్తుందని గ్రామీణాభివృద్ధి మంత్రి ఈశ్వరప్ప చెప్పారు.
కర్ణాటక రాష్ట్రంలో శాంతిభద్రతలపై సిద్ధరామయ్య చర్చ సందర్భంగా ఆర్ఎస్ఎస్ అంశం ప్రస్థావనకు వచ్చింది.దీనిపై స్పీకర్ కాగేరీ... ఆర్ఎస్ఎస్ను సంభాషణలోకి ఎందుకు లాగుతున్నారని సిద్ధరామయ్యను ప్రశ్నించారు. ‘‘మా ఆర్ఎస్ఎస్ను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?’’ అని స్పీకర్ సిద్ధరామయ్యను అడిగారు.దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... పక్షపాతం లేకుండా ఉండాల్సిన స్పీకర్ పీఠాన్ని అధిరోహించి ఆర్ఎస్ఎస్ ప్రతినిధిలా ‘‘మా ఆర్ఎస్ఎస్’’ అని ఎలా అంటారని చామరాజ్‌పేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్‌ఖాన్ కాగేరిని ప్రశ్నించారు.కాగేరి తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు.
అనంతరం ఒకరు ఇష్టపడినా ఇష్టపడక పోయినా ప్రధానమంత్రి మొదలుకొని అన్ని అగ్ర రాజకీయ హోదాలున్నవారు ఆర్ఎస్ఎస్కు చెందిన నాయకులేనని రెవెన్యూశాఖ మంత్రి అశోక అన్నారు.ముస్లింలు, క్రైస్తవులు కూడా త్వరలో ఆర్ఎస్ఎస్లో భాగమవుతారని మరో మంత్రి ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నేతలు కేజే జార్జ్, ప్రియాంక్ ఖర్గే, యూటీ ఖాదర్, అంజలి నింబాల్కర్ తదితరులు ఈ వ్యాఖ్యలను విమర్శించారు. దీంతో సభలో గందరగోళం కొనసాగడంతోనే అసెంబ్లీని మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి