అందరి చూపు అధ్యక్ష పదవిపైనే!

ABN , First Publish Date - 2021-09-18T06:23:24+05:30 IST

జిల్లాలో టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికలు పూర్తవుతుండగా ప్రస్తుతం అందరి దృష్టి జిల్లా అధ్యక్షుడి ఎంపికపైనే ఉంది. పార్టీకి కొత్త జిల్లా అధ్యక్షుడు ఎవరు అవుతారనే చర్చ కొనసాగుతోంది.

అందరి చూపు అధ్యక్ష పదవిపైనే!

జిల్లాలో కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌ కమిటీల ఎంపిక 

జిల్లా అధ్యక్షుడి ఎంపికపై పార్టీలో తీవ్ర చర్చ 

నిజామాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికలు పూర్తవుతుండగా ప్రస్తుతం అందరి దృష్టి జిల్లా అధ్యక్షుడి ఎంపికపైనే ఉంది. పార్టీకి కొత్త జిల్లా అధ్యక్షుడు ఎవరు అవుతారనే చర్చ కొనసాగుతోంది. గ్రామ కమిటీలు ఇప్పటికే పూర్తికాగా.. మండల కమిటీల ఎంపిక చేస్తున్నారు. మున్సిపల్‌ కమిటీలు కూడా పూర్తవుతుండడంతో ఇక జిల్లా అధ్యక్ష స్థానంపైనే సీనియర్‌ నేతలు గురిపెట్టారు. ఎవరికివారే ప్రయత్నాలు కొనసాగిస్తున్న ఇప్పటి వరకు అధ్యక్షుడు ఎవరవుతారనేది జిల్లా ప్రజాప్రతినిధులు ఇంకాచర్చించలేదు. గ్రామ, మండల, మున్సిపల్‌ కమిటీల ఎంపిక తర్వాత జిల్లా అధ్యక్షుల ఎంపికకు సీఎం ఆధ్వర్యంలోనే నిర్ణయం జరగనుండడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలను కలుస్తూ తమకు అవ కాశం ఇవ్వాలని కోరుతున్నారు. 

జిల్లాలో గత 15 రోజులుగా టీఆర్‌ఎస్‌ సంస్థాగత కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పార్టీ గ్రామస్థాయి నుంచి మున్సిపల్‌ వరకు కమిటీల ఎంపిక జరుగుతోంది. మొదట గ్రామ, మున్సిపల్‌ వార్డు కమిటీలను పూర్తిచేసిన ప్రజాప్రతినిధులు ప్రస్తుతం మండల, మున్సిపల్‌ కమిటీలను పూర్తిచేస్తున్నారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కమిటీల ఎంపిక జరుగుతోంది. అన్ని కమిటీలలో మహిళలు, సామాజిక వర్గాల ఆదారంగా అందరికీ అవకాశాలు ఇస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఆందోళనలు లేకుండా కమిటీల నిర్మాణాన్ని పూర్తిచేస్తున్నారు. ఇప్పటి వరకు పదవులు రానివారికి కమిటీలలో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. యువత కు కూడా కమిటీలలో అవకాశం ఇస్తున్నారు. మొత్తంగా నూతన కమిటీలలో 30నుంచి 40శాతం మందికి కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు.

కీలకంగా మారిన జిల్లా అధ్యక్షుడి ఎంపిక

ప్రస్తుతం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎంపిక కీలకంగా మారింది. వచ్చే రెండున్నరేళ్లలో ఎన్నికలు ఉండడం, ఎంపికయ్యే అధ్యక్షుడే కీలకంగా వ్యవహరించే అవకాశం ఉండడంతో ఈ దఫా ఎవరికి అవకాశం వస్తుందోనని చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడితో పాటు కొత్తవారిలో ఎవరికి ఇస్తారోనని పార్టీ కార్యకర్తలతో పాటు సీనియర్‌ నేతలు చర్చించుకుంటున్నారు. పార్టీలో కీలకంగా ఉన్న కొంతమంది నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొన్నేళ్ల క్రితం ఇతర పార్టీ ల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారికి కూడా ఈ దఫా అవకాశం వస్తుందని పార్టీ నేతల్లో చర్చ కొనసాగుతోం ది. ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్షుడు కీలకంగా ప్రచారంతో పాటు ఇతర బాధ్యతలు చేయాల్సి ఉండడ ంతో కలిసివస్తుందని ఎక్కువ మంది సీనియర్‌ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గో వర్ధన్‌, బిగాల గణేష్‌గుప్త, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్‌అమిర్‌లను కలుస్తూ ప్రయత్నం చేస్తున్నారు. మరికొ ంతమంది ఇతర నేతల ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు సీనియర్‌ నేతలు ప్రయత్నా లు చేస్తున్నా ఇంకా జిల్లాకు చెందిన కొత్త అధ్యక్షుడి ఎంపికపై ప్రజాప్రతినిధులు సమావేశం కాలేదు. గత  నెలలో ఒకసారి చర్చించినా ఇంకా జిల్లా అధ్యక్షుడి ఎం పికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 20 త ర్వాత జిల్లా అధ్యక్షుల ఎంపిక జరగనుంది. సమయం దగ్గరపడుతుండడంతో జిల్లా అధ్యక్షుడు ఎవరు అవు తారనే చర్చ కొనసాగుతోంది. 

సీఎం కేసీఆర్‌దే తుది నిర్ణయం

పార్టీ నేతల సమాచారం బట్టి ఈ దఫా అన్ని జిల్లాల అధ్యక్షుల ఎంపిక సీఎం కేసీఆర్‌ చేయనున్నట్టు తెలి సింది. ప్రతిపక్షాలకు దీటుగా పనిచేసే నేతలకే ఈ దఫా జిల్లా అధ్యక్షులుగా పట్టం కట్టనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు దగ్గరగా ఉండడం వల్ల బాగా పనిచేసే నేతలకు అవకాశం కల్పిస్తే జిల్లాస్థాయిలో ప్రతిపక్షాల ను దీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలలో జరిగిన సమావేశంలో కూడా రాష్ట్రస్థాయి కార్యదర్శులతో పాటు జి ల్లా మంత్రి, ఎమ్మెల్యేలకు ఇదే విషయాన్ని సీఎం చెప్పినట్టు తెలిసింది. పార్టీకి నమ్మకంగా పనిచేసే నేతకే ఈ దఫా అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడికి మరోదఫా అవకాశం ఇవ్వనున్నట్లు కొంతమంది నేతలు చెబుతున్నా.. సీఎం నిర్ణయం బట్టే ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడికి రాష్ట్రస్థాయిలో ఏదైనా నామినేటెడ్‌ పదవి ఇస్తే వేరే వ్య క్తులకు అవకాశం వస్తుందని పార్టీ నేతలు తెలిపారు.  నెలాఖరులోపు సీఎం కేసీఆర్‌ సామాజిక సమీకరణా లు పరిశీలించి పనిచేసేవారికే ఈ దఫా అవకాశం ఇస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-09-18T06:23:24+05:30 IST