నియోజకవర్గ నిధులపైనే అందరి దృష్టి!

ABN , First Publish Date - 2021-04-06T06:07:20+05:30 IST

నియోజకవర్గ అభివృద్ధి నిధులపైనే అధికార పార్టీ నేత లంతా దృష్టి సారించారు. రెండేళ్లుగా చిన్న చిన్న పనులకు ఇబ్బందులు పడుతున్న గ్రామ, మండల స్థాయి నేతలు ప్ర స్తుతం నిధులు వస్తుండడంతో తమకు కేటాయించాలని ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కోరుతున్నారు. ప్రతిపాదనలు వారికి ఇస్తున్నారు.

నియోజకవర్గ నిధులపైనే అందరి దృష్టి!

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిధులపై గ్రామ, మండల ప్రజాప్రతినిధుల నజర్‌

నిధులు పెంచడంతో తమకు కూడా కేటాయించాలని ఎమ్మెల్యేలకు వినతి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నియోజకవర్గ అభివృద్ధి నిధులపైనే అధికార పార్టీ నేత లంతా దృష్టి సారించారు. రెండేళ్లుగా చిన్న చిన్న పనులకు ఇబ్బందులు పడుతున్న గ్రామ, మండల స్థాయి నేతలు ప్ర స్తుతం నిధులు వస్తుండడంతో తమకు కేటాయించాలని ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కోరుతున్నారు. ప్రతిపాదనలు వారికి ఇస్తున్నారు. తప్పనిసరిగా పనులకు నిధులను కేటాయించాలని కోరుతున్నారు. గ్రామ, మండలస్థాయిలో పనిచేస్తున్న వారు తమ పరిధిలో చేసేందుకు ఈ నిధులను కేటాయిస్తే తమకు పలుకుబడి దక్కుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధులను పెంచింది. ప్రతీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సా లీనా రూ.5 కోట్లు కేటాయించింది. ఈ నిధులను నియోజకవర్గంలో అత్యవసర పనులకు ఖర్చు చేయాలని కోరింది. బ డ్జెట్‌ సంవత్సరం పూర్తయ్యేలోపు ఈ నిధులను వెచ్చించాలని ఆదేశాలను ఇచ్చింది. గతంలో నిధులను కేటాయించినా కరో నా వల్ల విడుదలకాలేదు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు పనులు చేసేందుకు ఇబ్బంది పడుతుండడం ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ బడ్జెట్‌లో నిధులను పెంచి కేటాయింపులు చేశారు. గ్రామ పంచాయతీలు, మం డల పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు నేరుగా నిధులు ఇచ్చిన వి ధంగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ దఫా నియోజకవర్గ అభివృద్ధి నిధులను పెంచారు. జిల్లాలో మొత్తం ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతీ నియోజకవర్గం పరిధిలో 90 ను ంచి 150 గ్రామాల వరకు ఉన్నాయి. వీటి పరిధిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వివిధ పథకాల కింద నిధుల ను ఖర్చు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు గ్రామాలలో పర్యటించిన సమయంలో వచ్చిన వినతులకు తక్షణంగా నిధులు కేటాయించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నియోజకవర్గ అ భివృద్ధి నిధులు లేకపోవడం, గ్రామస్థాయిలో నేతలు, కార్యకర్తలు అడిగిన సమయంలో పనులకు కేటాయించేందుకు నిధులు లేక వెనకడుగు వేశారు. ప్రస్తుతం ప్రభుత్వం నిధులను కేటాయించడం వల్ల జిల్లాకు సాలీన ఆ నియోజకవర్గా ల పరిధిలో రూ.30 కోట్లు రానున్నాయి. అలాగే స్థానిక సం స్థల ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన ముగ్గు రు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ నలుగురికి కూడా ఒక్కొక్కరికి రూ.5కోట్ల చొప్పున 20 కోట్ల రూపాయలు రానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం జిల్లాకు నియోజకవర్గాల అభి వృద్ధి పేరున రూ.50 కోట్ల వరకు రానున్నాయి. ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల పరిధిలో చిన్న చిన్న పనులకు, రోడ్డు మరమ్మతులకు, తాగునీటి ఇబ్బందులకు, పాఠశాలల మరమ్మతులకు ఇతర పనులకు ఈ నిధులను కేటాయించే అవకా శం ఉంది. ఆ గ్రామస్థాయి పరిధిలో ఉన్న నేతలు కూడా త మ పరిధిలో పనిచేసేందుకు నిధులను ఎమ్మెల్యేలు ఈ నిధి ద్వారా ఇచ్చేందుకు అవకాశం ఏర్పడింది. 

ప్రయత్నాలు మొదలుపెట్టిన ప్రజాప్రతినిధులు

నిధులు పెంచడం, ఆర్థిక సంవత్సరం మొదలుకావడంతో ఆయా ఎమ్మెల్యేల పరిధిలో గ్రామ, మండలస్థాయి నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమ గ్రామాల పరిధిలో ముఖ్యమైన పనులకు నిధులు కేటాయించాలని కోరుతున్నా రు. ఎమ్మెల్యేలకు ప్రతిపాదనలు అందిస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఈ నిధులను ఏవిధంగా, ఏ పనులకు ఖర్చు చేయాలో ఇంకా నిబంధనలు విడుదల చేయలేదు. అప్పటిలోపే ప్రతిపాదనలు ఇచ్చేందుకు ఎమ్మె ల్యేల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ అవకాశం లేనివారు ఎమ్మెల్సీలను పనుల కోసం నిధులను కేటాయించాలని కోరుతున్నారు. చాలా రోజుల తర్వాత నిధులు కూడా రావడంతో ఎమ్మెల్సీలు కూడా తమ అనుచరులు, ఇతర ప్రజాప్రతినిధు లు సూచించిన పనులకు కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామ పంచాయతీలకు చాలా నిధులు నేరుగానే వ స్తున్నాయి. వారు స్వయంగా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. సర్పంచ్‌లు, పాలకసభ్యులు, కార్యదర్శి క లిసి నిధులను ఖర్చు చేస్తున్నారు. ఈ నిధులతో కాని పనులకు ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కేటాయింపులు చేయనున్నారు. జిల్లాలోని సర్పంచ్‌లు కూడా త మ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కలుస్తూ తమకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు. మొత్తంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎమ్మె ల్యేలకు నిధులు రావడంతో తమ పరిధిలో కేటాయింపులు చేయాలని కోరుతున్నారు. తమ గ్రామాల పరిధిలో ఈ నిధు ల ద్వారా పనులు చేస్తే పేరు రావడంతో పాటు ఖర్చులు కూడా కలిసివస్తాయని భావిస్తున్నారు. భవిష్యత్‌లో రాజకీయంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యేల చు ట్టూ నిధుల కోసం తిరుగుతున్నారు. అయితే, విధివిధానాలు రాకపోవడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంకా కేటాయింపు లు చేయడంలేదు. నిబంధనలు వచ్చిన తర్వాత అధికారుల తో మాట్లాడి కేటాయించనున్నట్లు తెలుస్తోంది. నిబంధనల కు అనుగుణంగానే కేటాయింపులు ఉంటుందని ముఖ్య ప్ర ణాళికశాఖ అధికారులు తెలిపారు. ఆ నిబంధనలకు అనుగుణంగానే పనులు చేయాలని వారు తెలిపారు. నిబంధనలు విడుదల కాగా నే ఈ నిధులు కేటాయించే అవకాశం ఉంది.

Updated Date - 2021-04-06T06:07:20+05:30 IST