అర్హులందరూ బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-19T05:26:33+05:30 IST

కరోనా బారిన పడకుం డా ఉండేందుకు అర్హులందరూ బూ స్టర్‌ డోస్‌ వేసుకోవాలని కలెక్టర్‌ పమేలాసత్పథి కోరారు. మండలకేంద్రంలోని పీహెచ్‌సీని ఆమె మంగళవా రం ఆకస్మిక తనిఖీ చేశారు. బూస్టర్‌ డోస్‌ తీసుకున్న వారి వివరాలను డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.

అర్హులందరూ బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలి
తుర్కపల్లి పీహెచ్‌సీని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

కలెక్టర్‌ పమేలాసత్పథి


తుర్కపల్లి, బొమ్మలరామారం, జనవరి 18: కరోనా బారిన పడకుం డా ఉండేందుకు అర్హులందరూ బూ స్టర్‌ డోస్‌ వేసుకోవాలని కలెక్టర్‌ పమేలాసత్పథి కోరారు. మండలకేంద్రంలోని పీహెచ్‌సీని ఆమె మంగళవా రం ఆకస్మిక తనిఖీ చేశారు. బూస్టర్‌ డోస్‌ తీసుకున్న వారి వివరాలను డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌లో వైద్య ఆరో గ్య సిబ్బంది అందరూ బూస్టర్‌ డోసు తీసుకున్నారని, పోలీస్‌ శాఖలో 50 శాతం తీసుకున్నారని, రెవెన్యూ, మండల పరిషత్‌ కార్యాలయ సిబ్బందిలో కొందరు తీసుకోవాల్సి ఉందని డాక్టర్‌ చంద్రారెడ్డి కలెక్టర్‌కు వివరించారు. ఆసుపత్రిలో కలియదిరిగి అన్ని వార్డులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్య సిబ్బందిని అదేశించారు. ఆసుపత్రి పని తీరుపై సంతృప్తి వ్యక్తంచేశారు. అదేవిధంగా బొమ్మలరామారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆమెవెంట వైద్యాధికారి క్రాంతి, మెడికల్‌ అసిస్టెంట్‌ శంకర్‌, నూర్జాహాన్‌ ఉన్నారు. 


ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి 

భువనగిరి రూరల్‌: ప్రజావాణి ఫిర్యాదులు, ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా 227 పెండింగ్‌ దరఖాస్తులు ఉన్నాయని, వాటిని సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధరణి పోర్టల్‌కు సంబంధించి జిల్లాలో 921 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని,వాటిని పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, భువనగిరి, చౌటుప్పల్‌ ఆర్డీవోలు ఎంవీ భూపాల్‌రెడ్డి, సూరజ్‌కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో నాగేశ్వరచారి,తహసీల్దార్‌ కొప్పుల వెంకటేశ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T05:26:33+05:30 IST