అర్హులైన రైతులందరికీ బీమా ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-06-28T06:31:15+05:30 IST

గత ఖరీఫ్‌లో పంట సాగుచేసి నష్టపోయిన ప్రతి రైతుకు వాతావరణ బీమా వర్తింపజేయాలని సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

అర్హులైన రైతులందరికీ  బీమా ఇవ్వాలి
కదిరి ఏడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న దృశ్యం

సీపీఎం , రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా

పుట్టపర్తి, జూన 27: గత ఖరీఫ్‌లో పంట సాగుచేసి నష్టపోయిన ప్రతి రైతుకు వాతావరణ బీమా వర్తింపజేయాలని సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.  ఈ మేరకు ఆయా సంఘాల ఆధ్వర్యంలో రైతులు సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులం ద రూ భారీగా నష్టపోయినా... కొంతమందికి మాత్రమే పంటల బీమా వర్తిం పజేశారని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదం టే ఉధ్యమాన్ని ఉధృతం  చేస్తామని హెచ్చరించారు. నాయకులు వెంకటేశు, రామక్రిష్ణ, అంజి, నాగరాజు, బాబావలి, గౌస్‌లాజమ్‌, గంగాధర్‌, ముత్యాలు, రామాంజి, నాగరాజు, చంద్రశేఖర్‌ తదితరలు పాల్గొన్నారు.

ధర్మవరంరూరల్‌: పంటన బీమా అందని వేరుశనగ రైతులకు ఎకరాకు రూ.25వేలు పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఎం, ఏపీ చేనేత రాష్ట్ర అధ్యక్షుడు పోలారామాంజనేయులు, ్ల రైతుసంఘం జిలా నాయకుడు జంగాలపల్లి పెద్దన్న, ఎస్‌హెచ బాషా, ఇంతియాజ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంటలభీమాలో వేరుశనగ రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం, రైతుసంఘం ధర్మవరం డివిజన ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ఆర్డీఓ వరప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. సీపీఎం, సీఐటీయూ నాయకులు  జేవీరమణ, ఎం ఇంతియాజ్‌,  శ్రామిక మహిళ కన్వీనర్‌ దిల్షాద్‌, ఎల్‌ ఆదినారాయణ, బత్తలకదిరప్ప, మారుతి, పోతలయ్య, ముకుంద, బాబు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

కదిరి అర్బన:

 పంటల బీమా రాని రైతులకు ఎకరాకు రూ.25వేలు చొప్పున ఇనపుట్‌ సబ్సిడీ ఇవ్వాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమ వారం స్థానిక వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయం వద్ద ఆందోళన చేప ట్టారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి మాట్లాడుతూ  జిల్లాలో 3,49,988మంది రైతులు పంటలు సాగుచేశారని, వీరిలో 1,71,881 మందికి రైతులకు మాత్రమే ఇన్సూరెన్స వచ్చిందన్నారు. 1,78,117 మంది రైతులకు నయాపైసాకూడా ఇన్సూరెన్స రాలేదన్నారు. వేరుశనగ రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వరి, మొక్కజొన్న రైతులకు ఎకరాకు రూ.40వేలు, టమోటా, మిరప, ఇతర పంటలకు రూ.60వేలు ఇవ్వాలని డి మాండ్‌ చేశారు. సీఐటీయూ నాయకులు లక్ష్మీనారాయణ, జిఎల్‌ నరసిం హులు, సాంబశివ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాబ్‌జాన, రైతు సంఘం శివ న్న, నాగిరెడ్డి, రాజారెడ్డి, శంకర్‌రెడ్డి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T06:31:15+05:30 IST