దళితులంతా ఏకం కావాలి: మంత్రి ఎర్రబెల్లి

ABN , First Publish Date - 2022-02-04T00:08:21+05:30 IST

రాష్ట్రంలోని దళితులంతా ఏకం కావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

దళితులంతా ఏకం కావాలి: మంత్రి ఎర్రబెల్లి

హన్మకొండ: రాష్ట్రంలోని దళితులంతా ఏకం కావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దళితబంధు పథకంలో భాగంగా హుజురాబాద్‌లోని కమలపూర్ మండలానికి చెందిన 51 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, హార్‌వెస్టర్లు, ట్రాలీ ఆటోలను మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల, సత్యవతి రాథోడ్  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ 1737 కోట్లతో దళితబంధు పంపిణీ చేస్తున్నామన్నారు. కమలాపూర్‌లో  3893 మంది లబ్ధిదారులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దళితుల గురించి తప్పుడు ప్రచారం చేశారని, దళితులంతా ఏకం కావాలన్నారు. మూడు నాలుగు ఏళ్లలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల ఇవ్వాలకున్నామన్నారు. దళితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.  అంబేడ్కర్‌ను గౌరవించే ఏకైక సీఎం కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్‌ను విమర్శించాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆ రాజ్యాంగం చేయబట్టే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇంకా పటిష్టం చేయాలనేది కేసీఆర్ ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. ఇంకా పేద వర్గాలకు న్యాయం జరగాలన్నదే కేసీఆర్ ఉద్దేశమన్నారు. బండ్లకు డ్రైవర్లు, క్లీనర్లను ఓనర్లను కేసీఆర్ చేశారన్నారు. మీ కింద మరో 10 మందికి సాయం చేయాలని దళితులను ఆయన కోరారు. 

Updated Date - 2022-02-04T00:08:21+05:30 IST