అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లు

ABN , First Publish Date - 2020-05-29T10:52:29+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల విరామం అనంతరం ఈనెల 19 నుంచి ఆర్టీసీ సేవలు

అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లు

ఆర్టీసీకి కర్ఫ్యూ నుంచి సడలింపు  పెరుగనున్న ప్రయాణికులు


మంచిర్యాల కలెక్టరేట్‌, మే 28 : కరోనా లాక్‌డౌన్‌  కారణంగా రెండు నెలల విరామం అనంతరం ఈనెల 19 నుంచి ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. బుధవారం ముఖ్యమంత్రి సూచన మేరకు అన్ని రకాల బస్సులు అన్ని రూట్లలో నడిపించేందుకు అనుమతి లభించింది. పది రోజులుగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నడిపించగా సుమారు  రూ.4 లక్షల నుంచి 6 లక్షల వరకు ఆదాయం సమకూ రింది. గురువారం సడలింపు నేపథ్యంలో ఉదయం 3  నుంచి రాత్రి వరకు నడవడంతో రూ.8 లక్షల వరకు ఆదాయం రావచ్చని డీఎం మల్లేశయ్య పేర్కొన్నారు. గురువారం నుంచి 24 గంటలు బస్సులు నడువనున్న నేపథ్యంలో డిపో ఆవరణలో సమావేశం నిర్వహించా రు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.


మంచిర్యాల డిపోలో నాలుగు రాజధాని, 24 సూపర్‌ లగ్జరీ, రెండు డీలక్స్‌ బస్సులతో కలుపుకొని మొత్తం 140 బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు. బస్టాండ్‌ ఆవరణలో ప్రయా ణికులు భౌతిక దూరం పాటిస్తూ బస్సులు ఎక్కేందుకు సర్కిల్స్‌ను ఏర్పాటు చేశారు. కరోనా నివారణ కోసం ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రయాణికుల కోసం ఏర్పాటుచేశారు. గురువారం 256 మంది కండక్టర్లు, 210 మంది   డ్రైవర్లు షిప్టుల వారీగా విధులకు హాజరవుతున్నారని  పేర్కొన్నారు. ఆంక్షల సడలింపు నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు ఆదరణ పెరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


సురక్షిత ప్రయాణం అందించడమే లక్ష్యం..డీఎం. మల్లేశయ్య, మంచిర్యాల

ప్రయాణికులను కరోనా బారి నుంచి రక్షించేందుకు సుమారు 1200 లీటర్ల సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావ ణం అందుబాటులో ఉంది. రోజూ బస్సు డిపో నుంచి బయటకు వెళ్ళే ముందు సీట్లలో సోడియం హైపోక్లోరై డ్‌ ద్రావణం పిచికారి చేస్తున్నాం. ప్రయాణికులకు శాని టైజర్లు అందుబాటులో ఉంచాం. కండక్టర్లు, డ్రైవర్లు మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధరించేలా ఆదేశాలు జారీ చేశాం.  సురక్షిత ప్రయాణం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. 


కిక్కిరిసి ప్రయాణం

భౌతికదూరం పాటించకుండ నిబంధనలకు విరుద్ధం గా ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. గురువారం జనగామ నుంచి మంచిర్యాలకు వచ్చిన ఆర్డినరీ బస్సులో  90 మందికి పైగా ప్రయాణించారు. అధికారులను ప్రశ్నించగా ఎంత చెప్పినా ప్రయాణికు లు వినడంలేదని డిపో మేనేజర్‌ మల్లేశయ్య పేర్కొ న్నారు. మాస్క్‌లు ధరించని, శానిటైజర్లు తెచ్చుకోని ప్రయాణికులను అనుమతించమని, పరిమితికి మించి బస్సులో ఎక్కించుకోమని తెలిపారు. ప్రయాణికులు కూడా సహకరించాలన్నారు. 

Updated Date - 2020-05-29T10:52:29+05:30 IST