Chitrajyothy Logo
Advertisement

నేడే ‘మా’ ఎన్నికలు

twitter-iconwatsapp-iconfb-icon
నేడే మా ఎన్నికలు

గత రెండు మూడు నెలలుగా ‘మా’ ఎన్నికలపై జరుగుతున్న రచ్చకు నేటితో ఫుల్‌స్టాప్ పడనుంది. నేడు(ఆదివారం) జరగనున్న ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, విష్ణులలో ఎవరో ఒకరు ‘మా’ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. ఈ ఇద్దరి ప్యానల్స్‌లో ఎవరైతే గెలుస్తారో.. వారితో నూతన ‘మా’ అధ్యక్షుడు పాలన కొనసాగిస్తారు. అలాగే, ఇన్ని రోజులుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న వారంతా మేమంతా ఒకటే అంటూ కలిసి పని చేసుకుంటారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్లో పోలింగ్‌ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ ఎన్నికలకు ముందు జరిగిన చిత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే.. 


ముందుగా ప్రకాశ్ రాజ్ ‘మా’ ఎన్నికలలో పోటీ చేస్తున్నానంటూ ప్రకటించారు. ప్రకాశ్ రాజ్ ప్రకటన తర్వాత అంతా కూల్ ‌గానే ఉంది. ఆ తర్వాత నేనంటే నేను అంటూ మంచు విష్ణు, హేమ, జీవితలు అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్లుగా ప్రకటించారు. వీరితో పాటు సీనియర్ నటుడు సివిఎల్ నరసింహారావు కూడా తెలంగాణ అంటూ పోటీలోకి దిగారు. అక్కడి నుండి ‘మా’ ఎన్నికల రాజకీయ రచ్చ మొదలైంది. రోజుకో రకంగా మలుపులు తిరిగిన ఈ రచ్చలో జీవిత, హేమ వంటి వారు అధ్యక్ష రేసు నుంచి ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లోకి వచ్చేశారు. సివిఎల్ నరసింహారావు కొన్ని రోజులు హడావుడి చేసి, మ్యానిఫెస్టో ప్రకటించిన కొన్ని గంటలలోనే నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. కె. శ్రవణ్ కుమార్ అనే అతను కూడా అధ్యక్ష పదవికి పోటీ చేసి.. తర్వాత నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఫైనల్‌గా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణుల మధ్య నువ్వంటే నువ్వు అనే పోటీ నెలకొంది. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌‌కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తున్నట్లుగా మెగాబ్రదర్ నాగబాబు ప్రకటించారు. మంచు విష్ణు ప్యానల్‌కు మోహన్ బాబుతో పాటు నరేష్ ఇంకా సీనియర్ నటీనటులు కొందరు సపోర్ట్ చేస్తున్నట్లుగా తెలియజేశారు. రెండు ప్యానల్స్‌లోని సభ్యులు టైమ్ వచ్చినప్పుడల్లా.. ప్రత్యర్థి ప్యానల్‌పై కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల విషయం వదిలి పర్సనల్‌గా టార్గెట్ చేసుకునే స్థాయికి వెళ్లారు. మరి ఇలాంటి వాడి,వేడిని క్రియేట్ చేసిన ఈ ‘మా’ ఎన్నికల పర్వంలో చివరికి రాజు అయ్యేది ఎవరో మరికొన్ని గంటలలో తెలిసిపోనుంది. అప్పటి వరకు ‘మా’ అప్‌డేట్స్ మిస్ కాకండి.   

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement