అందరి దృష్టి... అటువేపే... ప్రారంభమైన GST Council సమావేశం

ABN , First Publish Date - 2022-06-28T21:22:22+05:30 IST

రెండు రోజులపాటు జురగనున్న GST Council సమావేశం మంగళవారం చాండీఘర్‌లో ప్రారంభమైంది.

అందరి దృష్టి... అటువేపే...   ప్రారంభమైన GST Council సమావేశం

* ‘ఒక దేశం... ఒకే పన్ను’నై చర్చ

చండీఘర్ : రెండు రోజులపాటు జురగనున్న GST Council సమావేశం మంగళవారం చాండీఘర్‌లో ప్రారంభమైంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పరిహారంపై ఈ సమావేశంలో హాట్‌పొటాటో చర్చ జరగనుంది. అలాగే... ‘ఒక దేశం-ఒకే పన్ను’ విధానంపై కూడా చర్చించనున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ ‘47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం’పై అందరి దృష్టీ, ప్రత్యేకించి... వ్యాపారవర్గాల దృష్టి నెలకొంది.


కాగా... GST Council సమావేశం సందర్భంగా పలు డిమాండ్లు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ‘GST పరిహారం సమస్య మాకు చాలా ముఖ్యమైనది. జూన్ 30న ముగిసే 14 శాతం రక్షిత రెవెన్యూ పెంపు ప్రోటోకాల్‌ను కనీసం ఐదేళ్లపాటు పొడిగించాలి’ అని చత్తీస్‌గఢ్ మంత్రి TS సింగ్ డియో డిమాండ్ చేశారు. ‘మేము జిఎస్‌టీ రేట్ల పెంపుదలకు అనుకూలం కాదు. జిఎస్‌టీ రేట్ల స్లాబ్‌ల హేతుబద్ధీకరణకు మేము అనుకూలం.. తక్కువ జిఎస్‌టీ రేట్లతో పన్ను వసూలు చేయడం వల్ల అధిక పన్ను వసూళ్లు సాధ్యమవుతాయి’ అని ఆయన పేర్కొన్నారు. ఇక మరికొన్ని రాష్ట్రాల నుంచి తెరమీదకు వచ్చిన డిమాండ్లు ఇలా ఉన్నాయ.  


     * రాష్ట్రాలకు GST పరిహారం చెల్లింపు... కొన్ని ప్రతిపక్ష-పాలిత రాష్ట్రాలు జూన్ 30న ముగిసే 14 శాతం రక్షిత రెవెన్యూ పెంపు ప్రోటోకాల్‌ను కనీసం ఐదేళ్లపాటు పొడిగించాలి.                           * పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు జీఎస్‌టీ పరిహారం అంశం.                                                                                                         * ఆన్‌లైన్ గేమ్‌లు, క్యాసినోలు, గుర్రపు పందాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలపై, క్రీడాకారుడు చెల్లించే పోటీ ప్రవేశ రుసుము సహా 28% ఏకరీతి రేటును విధించే ప్రతిపాదనపై రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం ప్రతిపాదనను GST కౌన్సిల్ చర్చించే అవకాశం..!                      * కర్నాటక ముఖ్యమంత్రి నేతృత్వంలో పన్ను హేతుబద్ధీకరణపై ఏర్పాటైన GoM(మంత్రుల బృందం) అందించిన మధ్యంతర నివేదికపై చర్చ.                                                              * ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు GST రేట్ల పెంపుదలకు అనుకూలంగా లేవు. పన్ను రేట్ల మెరుగైన హేతుబద్ధీకరణకు ఆయా రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయి.                                                  * ప్రస్తుతం... GSTకి సంబంధించి 0, 1, 2, 5, 12, 18, 28, 28 + సెస్ శ్లాబ్‌లు అమల్లో ఉన్నాయి. కాగా... కొన్ని రాష్ట్రాలు రేట్లు కేవలం 2-3 పన్ను శ్లాబ్‌లకు పరిమితం చేయాలని కోరుతున్నాయి.                                                                                                          * కిన్ని రాష్ట్రాలు ఇన్‌పుట్ క్రెడిట్‌కు సంబంధించి మెరుగైన హేతుబద్ధీకరణ సమస్య అంశాన్ని చర్చించాలని కోరే అవకాశముంది.


     సిక్కిం, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్‌ రాష్ట్రాలులు సానుకూల అంతరాన్ని నమోదు చేయగా, హిమాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, పంజాబ్ వంటి రాష్ట్రాలు ప్రతికూల ఆదాయ అంతరాన్ని నమోదు చేశాయని వినవస్తోంది. ఈ అంశంపై కూడా సమావేశం చర్చించనున్నట్లు వినవస్తోంది. 

Updated Date - 2022-06-28T21:22:22+05:30 IST