అన్నీ తప్పుడు విధానాలే

ABN , First Publish Date - 2020-06-24T07:14:12+05:30 IST

సరిహద్దు ల్లో చైనాతో ఘర్షణలపై కేంద్రం తప్పుడు ప్రచా రం చేస్తోందని, ప్రజల దృష్టిని వాస్తవాలనుంచి మళ్లిస్తోందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ ..

అన్నీ తప్పుడు విధానాలే

మోదీ ప్రభుత్వ అసమర్థత వల్లే చైనాతో ఘర్షణలు..

క్రూడాయిల్‌ రేటు తగ్గితే ‘పెట్రో’ పెంపా?: సోనియా

గట్టినిర్ణయాలు కావాలి: మన్మోహన్‌

విదేశాంగ విధానమిదేనా: రాహుల్‌

సీడబ్ల్యూసీ భేటీలో నేతల ధ్వజం


న్యూఢిల్లీ, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): సరిహద్దు ల్లో చైనాతో ఘర్షణలపై కేంద్రం తప్పుడు ప్రచా రం చేస్తోందని, ప్రజల దృష్టిని వాస్తవాలనుంచి మళ్లిస్తోందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ)తీవ్రంగా విమర్శించింది. పెట్రోలు, డీజి ల్‌ ధరలను పెంచి ప్రజల నుంచి లాభాలు ఆర్జించే ప్రయత్నం చేస్తోందని, కరోనా నియంత్రణలో వైఫల్యాన్ని రాష్ట్రాలపై భారంతో తప్పించుకోజూస్తోందని మంగళవారం నాటి సీడబ్ల్యూసీ సమావేశంలో నాయకులు ధ్వజమెత్తా రు. ఈ అంశాలపై జాతీయస్థాయిలో ఉద్యమం నిర్వహించాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. మోదీ ప్రభుత్వం తప్పుడు విధానాలు అనుసరించి, అస్తవ్యస్తంగా వ్యవహరించడంతో చైనా సరిహద్దుల్లో తీవ్రఉద్రిక్తత నెలకొందని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. సరిహద్దుల్లో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు పటిష్ఠమైన నిర్ణయాలు తీసుకోకపోతే ప్రమాదకరమని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హెచ్చరించారు. భారత భూభాగాన్ని ఆక్రమించలేదన్న చైనా వాదనను అంగీకరించడం ద్వారా ప్రధాని మోదీ భారత విదేశాంగ విధానానికి తూట్లుపొడుస్తున్నారని, మన సైన్యానికి ద్రోహం చేస్తున్నారని రాహుల్‌గాంధీ అన్నారు. 


పొంతనలేని ప్రభుత్వ ప్రకటనలు!

గల్వాన్‌ లోయతోపాటు సరిహద్దుల్లో భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా దళాలు ఆ ప్రాంతాలు తమవేనని చెప్పుకోవడం సహించరానిదని వర్కింగ్‌ కమిటీ తెలిపింది. రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి, విదేశాంగశాఖ ప్రకటనలకు భిన్నంగా ప్రధాని వ్యాఖ్యలు చేశారనీ, చైనా తన చొరబాట్లను సమర్థించుకునేందుకు మోదీ వీలు కల్పించారని తెలిపింది. 


ప్రజలపై కనికరం లేని మోదీ 

పెట్రోలు, డీజిల్‌ ధరలపై 3 నెలలుగా కేం ద్రం పన్నులను, ఎక్సైజ్‌ సుంకాన్ని తీవ్రంగా పెంచుతూ ప్రజలనుంచి లాభాలను పిండుతోం దని సీడబ్ల్యూసీ విమర్శించింది.ప్రజల కష్టాలపై ప్రభుత్వానికి కనికరం లేదని తేలిందని విమర్శించింది. కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోవడంపై కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన నగరాల్లో ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయని, వైద్య సిబ్బంది తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారని తెలిపింది. కరోనా చికిత్సకు ఫీజులను నియంత్రించాలని, ఔషధాలు సులభంగా తక్కువ ధరకు లభ్యమయ్యేలా చూడాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కొవిడ్‌-19కు బీమా కవరేజి ఇచ్చేందుకు ముందుకు రాని బీమా కంపెనీలపై పెనాల్టీలు విధించాలని డిమాండ్‌ చేసింది. 


రాహుల్‌కు అధ్యక్ష పదవిపై చర్చ

సమావేశం మధ్యలో రాహుల్‌ గాంధీని మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కోరారు. అయితే అలాంటి చర్చ ఏమీ జరగలేదనీ, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని పార్టీ అధికార ప్రతినిధి రణదీ్‌పసింగ్‌ సుర్జేవాలా చెప్పారు.


భూమి ధారాదత్తం కాంగ్రెస్‌ పనే: నడ్డా 

భారత్‌ను విభజించి, సైన్యం మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలకు 2008లో కాంగ్రెస్‌ పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీతో కుదుర్చుకున్న ఎంవోయూయే కారణమా? అని ప్రశ్నించారు. ఈ ఎంవోయూ తర్వాత భారత భూభాగాన్ని చైనాకు కాంగ్రెస్‌ ధారాదత్తం చేసిందని ఆరోపించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్న ప్రచారంతో కాంగ్రెస్‌ నేతలు ‘పైశాచిక ఆనందాన్ని’ పొందుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర వ్యాఖ్యానించారు. భారత భూభాగంలో అంగుళం కూడా చైనా ఆక్రమించుకోలేదన్నారు. 

Updated Date - 2020-06-24T07:14:12+05:30 IST