చట్టం ముందు అందరూ సమానులే!

ABN , First Publish Date - 2022-08-12T04:57:43+05:30 IST

చట్టం ముందు అందరూ సమానులేనని సీని యర్‌ సివిల్‌ జడ్జి, మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ జి.కుము దిని అన్నారు.

చట్టం ముందు అందరూ సమానులే!
మాట్లాడుతున్న న్యాయమూర్తి కుముదిని

పర్చూరు, ఆగస్టు 11: చట్టం ముందు అందరూ సమానులేనని సీని యర్‌ సివిల్‌ జడ్జి, మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ జి.కుము దిని అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం మండల న్యాయసేవాధికార సంస్థ  ఆధ్వర్యంలో మండలం లోని నాగులపాలెం గురుకుల బాలికల కళాశాలలో న్యాయవిజ్ఞాన స దస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్జి కుముదిని మాట్లాడు తూ చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కల్గిఉండాలన్నారు. బాలికలు విద్యావంతులైతేనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆస్తి హక్కులో కూడా పురుషునితోపాటు, స్త్రీకి కూడా సమాన హక్కు క ల్పించారన్నారు. క్యాక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ పి.విశ్వరాణి, వైస్‌ ప్రిన్సిపాల్‌ స్వర్ణలత, ఎ.రాజేంద్రప్రసాద్‌, పి.లూకాపాల్‌, కోర్టు సూప రింటెండెంట్‌ రాఘవలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


మహిళల హక్కుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు

అద్దంకి, ఆగస్టు 11: మహిళల హక్కుల సంరక్షణకు ప్రత్యేక చట్టా లు ఉన్నాయని సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబునాయక్‌ అన్నారు. మం డలంలోని విప్పర్లవారిపాలెంలో గురువారం సాయంత్రం మండల న్యా యసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాది గృహలక్ష్మి అధ్యక్షతన మహిళా హక్కులు సంరక్షణపై న్యాయవిజ్ఞాన  సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బాబునాయక్‌ మాట్లాడుతూ మహిళలు ఉచిత న్యాయ సహాయం పొందే అవకాశం ఉందన్నారు. చట్టాల పట్ల ప్రతి మహిళా అవగాహన  కలిగి ఉండాలన్నారు.  కార్యక్రమంలో డిప్యూటీ తహసీ ల్దార్‌  సుధారాణి, పంచాయతీ కార్యదర్శి అరుణ్‌కుమార్‌, న్యాయవాదు లు గృహలక్ష్మి, నాగేశ్వరరావు, జబ్బార్‌, పారాలీగల్‌ వలంటీర్‌ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


హక్కుల గురించి తెలుసుకోవాలి

చీరాలటౌన్‌, ఆగస్టు11: మహిళలు చట్టం ద్వారా వారికి కల్పించిన హక్కులను తెలుసుకోవాలని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రెహాన అన్నారు. గురువారం మండల న్యాయ సేవాఽధికార సంస్థ ఆధ్వర్యంలో మునిసిపల్‌ పరిధిలోని అంబేడ్కర్‌ నగర్‌లో జరిగిన న్యాయ విజ్ఞాన స దస్సులో ఆమె మాట్లాడారు. స్థానికంగా జరుగుతున్న బాల్య వివాహా లు అడ్డుకోవాలని సూచించారు. అలాగే పురుషులతో పాటు మహిళల కు సమాన హక్కులు ఉన్నట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమాలకు ఆటంకం కలిగినట్లయితే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పరిష్కారం పొందవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో సీడీపీవో ఝాన్సీరాణి, న్యాయవాదులు రామకృష్ణారెడ్డి, వాసుబాబు, సుబ్బారెడ్డి, శ్రీకాంత్‌, మథీన్‌, ఇమ్మానుయేల్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-12T04:57:43+05:30 IST