బాబ్రీ కేసులో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-09-30T18:31:25+05:30 IST

ఉత్కంఠకు తెరపడింది. ఏళ్ల నాటి కేసులో తుది తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్కే యాదవ్ చదివి వినిపించారు.

బాబ్రీ కేసులో న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

లఖ్‌నవ్: ఉత్కంఠకు తెరపడింది. ఏళ్ల నాటి కేసులో తుది తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పును సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్కే యాదవ్ చదివి వినిపించారు. 2000 పేజీల తీర్పులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతితో సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మంది నిర్దోషులేనని పేర్కొన్నారు. వీరు నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు ఎటువంటి ఆధారాలు లేవని... సీబీఐ తగిన సాక్ష్యాధారాలను చూపలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది.  

Updated Date - 2020-09-30T18:31:25+05:30 IST