Cable car incident: అంతా సురక్షితం

ABN , First Publish Date - 2022-06-21T01:54:43+05:30 IST

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలాన్ జిల్లాలో కేబుల్ కార్‌లో చిక్కుకున్న మొత్తం 11 మంది టూరిస్టులను..

Cable car incident: అంతా సురక్షితం

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సోలాన్ జిల్లాలో కేబుల్ కార్‌లో చిక్కుకున్న మొత్తం 11 మంది టూరిస్టులను రెస్క్యూ టీమ్ సోమవారం సాయంత్రానికల్లా సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. దీంతో ఇటు టూరిస్టులు, అటు సహాయసిబ్బంది తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నారు. సహాయక సిబ్బంది సుమారు 6 గంటల సేపు శ్రమించి ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. గాలిలో చిక్కుకుపోయిన టూరిస్టులను ఒకరి వెంట మరొకరిని కిందకు తీసుకువచ్చినట్టు రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ అధికారి ఒకరు తెలిపారు.


సోలాన్ జిల్లా పర్వానులో సోమవారం మధ్యాహ్నం ఒక కేబుల్ కారు సాంకేతక కారణాలతో గాలిలోనే నిలిచిపోయింది. దీంతో అందులోని 11 మంది పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు. టింబర్ ట్రయిల్ ఆపరేటర్ టెక్నికల్ టీమ్, పోలీసు టీమ్‌తో పాటు డిజాస్టర్ మేనేజిమెంట్ టీమ్‌ కూడా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ముఖ్యమంత్రి జైరామ్ ఠాగూర్ సైతం సహాయక కార్యక్రమాలను సమీక్షిస్తూ వచ్చారు. కాగా, కేబుల్ కార్‌లో చిక్కుకున్న వారంతా ఢిల్లీకి చెందిన పర్యాటకులేనని ఈ ఆపరేషన్‌లో బయటపడిన ఒకరు మీడియాకు తెలిపారు.

Updated Date - 2022-06-21T01:54:43+05:30 IST