అలీబాబాపై రూ.21వేల కోట్ల జరిమానా

ABN , First Publish Date - 2021-04-11T06:10:48+05:30 IST

ప్రపంచ ఈ-కామర్స్‌ దిగ్గజ కంపెనీ అలీబాబా గ్రూప్‌పై చైనా రెగ్యులేటరీ సంస్థలు కొరడా ఝుళింపించాయి. దేశీయ మార్కెట్లో తన వ్యాపారానికి ఎదురులేకుండా చేసేందుకు గాను యాంటీ-కాంపిటీటివ్‌ (గుత్తాధిపత్య) ఎత్తుగడలకు అలీబాబా పాల్పడిందని

అలీబాబాపై రూ.21వేల కోట్ల జరిమానా

బీజింగ్‌: ప్రపంచ ఈ-కామర్స్‌ దిగ్గజ కంపెనీ అలీబాబా గ్రూప్‌పై చైనా రెగ్యులేటరీ సంస్థలు కొరడా ఝుళింపించాయి. దేశీయ మార్కెట్లో తన వ్యాపారానికి ఎదురులేకుండా చేసేందుకు గాను యాంటీ-కాంపిటీటివ్‌ (గుత్తాధిపత్య) ఎత్తుగడలకు అలీబాబా పాల్పడిందని పేర్కొంటూ ఏకంగా 280 కోట్ల డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.21,000 కోట్లు) జరిమానాను విధించినట్లు రెగ్యులేటరీ సంస్థలు వెల్లడించాయి. గత ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా చైనా కుబేరుడు జాక్‌ మా సారథ్యంలోని అలీబాబా గ్రూప్‌.. గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడినట్లు తమ విచారణలో తేలటంతో చైనా ఏకచ్ఛత్రాదిపత్య నిరోధ చట్ట నిబంధనలకు లోబడి భారీ జరిమానాను విధించినట్లు చైనా స్టేట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ మార్కె ట్‌ రెగ్యులేషన్‌ (ఎస్‌ఏఎంఆర్‌) తెలిపింది. 2015 నుంచి మార్కెట్లో అగ్రస్థానాన్ని కొనసాగించేందుకు అలీబాబా  నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ వస్తోందని పేర్కొం ది. దీంతో విక్రేతలతో పాటు కొనుగోలుదారులు కూడా నష్టపోవాల్సి వచ్చిందని తెలిపింది.   

Updated Date - 2021-04-11T06:10:48+05:30 IST