May 31 2021 @ 00:10AM

అలియా వ్యాక్సినేషన్‌ వీడియో

లాక్‌డౌన్‌ సమయంలో కొవిడ్‌ బాధితులకు పలు రూపాల్లో తన  సాయాన్ని అందించారు బాలీవుడ్‌ కథానాయిక అలియాభట్‌. ఉచిత వైద్యం, ఔషధాలు, ఆహారం అందించే సంస్థల వివరాలను ఆమె తన సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వ్యాక్సినేట్‌ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిద్వారా వ్యాక్సిన్‌కు సంబంధించిన ఉపయోగకరమైన సమాచారాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన కార్యక్రమంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించిన అపోహలు, సందేహాలను అలియా అడిగి నివృత్తి చేశారు.  దీనికి సంబంధించిన రెండో భాగాన్ని తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా వైరలయింది. గర్భిణులు టీకా తీసుకోవచ్చా? ఏ వ్యాక్సిన్‌ సమర్థవంతంగా పనిచేస్తుంది అనే విషయాలను ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌ ఈ వీడియోలో తెలిపారు.