Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 10 Aug 2022 20:28:53 IST

Darlings: ప్రాంతీయ భాషల్లో రీమేక్ కానున్న ఆలియా భట్ సినిమా

twitter-iconwatsapp-iconfb-icon

అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న అందాల భామ ఆలియా భట్ (Alia Bhatt). విలక్షణ నటన, వైవిధ్య భరిత సినిమాలతో ప్రేక్షకులకు చేరువైంది ‘రాజీ’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాలతో మెప్పించింది. తాజాగా ఆలియా నటించిన చిత్రం ‘డార్లింగ్స్’ (Darlings). ఈ సినిమాకు షారూఖ్ ఖాన్‌తో పాటు ఆలియా భట్ నిర్మాతగా వ్యవహరించారు. ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ప్లిక్స్‌లో ఈ చిత్రం నేరుగా విడుదలైంది. ఈ మూవీలో ఆమె నటనకు అభిమానుల మన్ననలతో పాటు, విమర్శకుల ప్రశంసలు దక్కాయి. డార్లింగ్స్ సంచలన విజయం సాధించడంతో మేకర్స్ మరో రెండు భాషల్లో రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా కథలో మార్పులు చేసి వెండితెర మీదకు తీసుకురాబోతున్నారు. 


షారూఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్‌మెంట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గౌరవ్ వర్మ ఈ అంశంపై మాట్టాడాడు. తెలుగు, తమిళ్‌లోకి రీమేక్ చేయబోతున్నట్టు తెలిపాడు. కథ అదే విధంగా ఉన్నప్పటికి ప్రాంతాలకు అనుగుణంగా మార్పులు చేయనున్నామని చెప్పాడు. ‘‘డార్లింగ్స్ కథ ముంబై నేపథ్యంలో తెరకెక్కింది. తెలుగు, తమిళ్‌లకు కొత్త ప్రపంచాన్ని రూపొందించనున్నాం. ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా పాత్రలను మారుస్తాం’’ అని గౌరవ్ వర్మ స్పష్టం చేశాడు. ‘డార్లింగ్స్’ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 5న విడుదలైంది. జస్మీత్ రీన్ దర్శకత్వం వహించింది. విజయ్ వర్మ (Vijay Varma), షెఫాలీ షా, రోషన్ మాథ్యూ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కు నెట్‌ఫ్లిక్స్ భారీగా చెల్లించిందట. దాదాపుగా రూ. 80కోట్లు చెల్లించి డిజిటల్ రైట్స్‌ను నెట్‌ప్లిక్స్ సొంతం చేసుకుందని కథనాలు వెలువడుతున్నాయి.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement