Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 30 Jun 2022 17:23:33 IST

పెళ్లయిన నెలకే అదెలా సాధ్యమంటూ నెట్టింట కామెంట్స్.. Alia Bhatt, Ranbir పెట్టిన పోస్ట్‌పై..

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్స్‌లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ (Alia Bhatt) ఒకరు. ఆలియా, రణ్‌బీర్ దాదాపుగా ఏడేళ్లు డేటింగ్ చేశారు. అనంతరం ఏప్రిల్ 14న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతికొద్ది సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి అయిన మూడు నెలల్లోపే ఈ జంట అభిమానులకు శుభవార్తను తెలిపారు. తాము త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామని వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆస్పత్రిలో స్కానింగ్ తీసుకుంటున్న ఫొటోను ఆలియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘మా బేబీ త్వరలోనే రాబోతుంది’’ అంటూ ఇన్‌స్టాలో క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ పెట్టిన వెంటనే ఆలియా, రణ్‌బీర్‌లకు అభిమానులతో పాటు సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలిపారు. 


కొంత మంది నెటిజన్స్ మాత్రం ఆలియా ప్రెగ్నెన్సీ వార్త తెలియగానే ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కడుపులో ఉన్న నెలరోజుల పిండానికి సంబంధించిన ఎదుగదలను సోనోగ్రఫీ మెషీన్‌లో చూడటం ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు. పెళ్లికి ముందే ఆమె గర్భవతి అయిందని కామెంట్లు చేస్తున్నారు. అందుకే ఆదరాబాదరాగా పెళ్లి చేసుకున్నారంటున్నారు. ఆలియా భట్ ప్రెగ్నెన్సీతో ఆమె నటిస్తున్న సినిమాల షూటింగ్ వాయిదా పడిందని పలు వెబ్‌సైట్స్‌ల్లో వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై ఆమె టీమ్ స్పందించింది. ఆలియా నటిస్తున్న హాలీవుడ్ ప్రాజెక్టు ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ (Heart of Stone) షూటింగ్‌ను త్వరలోనే పూర్తి చేస్తుందని ఆమె టీం తెలిపింది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...