Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 05 Feb 2022 20:27:28 IST

చేతులెత్తి దండం పెట్టిన Ranbir... ‘బెస్ట్ బాయ్‌ఫ్రెండ్’ అంటూ మురిసిన Alia!

twitter-iconwatsapp-iconfb-icon

‘గంగూభాయ్ కతియావాడి’ సినిమాలోని ఓ సీన్‌లో చేతులెత్తి నమస్కారం చేస్తుంది ఆలియా భట్. బాగా పాప్యులర్ అయిన అదే ‘నమస్తే’ పోజుని రణబీర్ కూడా రీక్రియేట్ చేశాడు! పాపరాజీ కెమెరాల ముందుకొచ్చిన ఆయన ‘గంగూభాయ్’ ట్రైలర్ ఎలా ఉందన్న మీడియా వారి ప్రశ్నకి... రెండు చేతులెత్తి దండం పెట్టేశాడు! సేమ్ ఆలియా లాగే రణబీర్ ఫోజు ఇవ్వటంతో ఆ పిక్స్, వీడియో అమాంతం వైరల్ అయిపోయాయి.

చేతులెత్తి దండం పెట్టిన Ranbir... బెస్ట్ బాయ్‌ఫ్రెండ్ అంటూ మురిసిన Alia!

రణబీర్ తన ‘గంగూభాయ్’ ‘నమస్తే’ ఫోజుని రీక్రియేట్ చేయటంతో... ఆలియా భట్ మురిసిపోయింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తామిద్దరి ఫోటోల్ని జత చేసి పోస్ట్ చేసింది. రణబీర్, ఆలియా ఒకే విధంగా చేతులెత్తి నమస్కరించటం మనం చూడవచ్చు...  


రణబీర్ తనలాగే నమస్కారం చేసిన ఫోటోని నెటిజన్స్‌తో పంచుకున్న ఆలియా ‘బెస్ట్ బాయ్‌ఫ్రెండ్ ఎవర్’ అంటూ కితాబునిచ్చేసింది! అయితే, మొదట్లో తమ మధ్య రిలేషన్‌ని పెద్దగా డిస్కస్ చేయని బాలీవుడ్ యంగ్ కపుల్ కొద్ది రోజులుగా ఓపెన్ అవుతూ వస్తున్నారు. నిజానికి కరోనా అడ్డుపడకపోయి ఉంటే రణబీర్, ఆలియా ఈపాటికే ఆలుమగలు అయిపోయేవారు. కానీ, లాక్‌డౌన్స్ వల్ల బీ-టౌన్స్ మచ్ అవెయిటెడ్ వెడ్డింగ్ వాయిదా పడుతూ వస్తోంది. త్వరలో ‘గంగూభాయ్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో జనం ముందుకొస్తోన్న ఆలియా తరువాత ప్రియుడు రణబీర్‌తో ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కనిపించనుంది. ఆ సినిమా రిలీజ్ తరువాత తన ‘బెస్ట్ బాయ్‌ఫ్రెండ్’ని ఆలియా పెళ్లాడుతుందని ముంబై టాక్! చూడాలి మరి, 2022 ఈయర్ ఎండింగ్‌లో ఎలాంటి సర్‌ప్రైజ్ ఉండబోతోందో... 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement