Jul 9 2021 @ 16:44PM

ఆలియా అక్కడ నిరూపించుకుంటుందా?

ప్రియాంకా చోప్రా, దీపికా పడుకోన్‌ బాలీవుడ్‌లో కథానాయికలుగా నిరూపించుకుని హాలీవుడ్‌లో అవకాశాలు అందుకున్నారు. పలు సినిమా, సిరీస్‌ల్లో నటించి గ్లోబల్‌స్టార్స్‌గా ఎదిగారు. తాజాగా ఆలియాభట్‌ కూడా హాలీవుడ్‌ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారనీ, ఆ దిశగా ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టారనే వార్తలు కొద్దిరోజులుగా బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె డబ్ల్యూఎమ్‌ అనే హాలీవుడ్‌ ఎజెన్సీతో కంట్రాక్ట్‌ కుదుర్చుకుందని, ఈ సంస్థతో ఈ సినిమాకు సంతకం కూడా చేసినట్లు ఆలియా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కానుందీ ముద్దుగుమ్మ. ‘హిందీలో ‘గంగూబాయ్‌ కతియావాడి’, ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహాని’  చిత్రంతో కూడా నటిస్తుంది. మరోపక్క తాను నిర్మిస్తున్న ‘డ్రీమ్స్‌’ చిత్రంలోనూ నటిస్తుంది. 


Bollywoodమరిన్ని...