Abn logo
Oct 28 2020 @ 20:50PM

ఆలియా రాక అప్పుడేనా..?

Kaakateeya

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్‌ ఫిక్షనల్‌ పీరియాడికల్‌ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్‌'. కోవిడ్‌ నేపథ్యంలో రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను రీస్టార్ట్‌ చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో ఆలియా భట్‌ జాయిన్‌ అవుతుందని రాజమౌళి ఓ సందర్భంలో తెలియజేసిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఆలియా భట్‌ నవంబర్‌ 2 నుండి యూనిట్‌తో జాయిన్‌ అవుతుందట. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ జోడీ సీత పాత్రలో ఆలియా భట్‌ నటిస్తుంది. ఈ పాత్ర నిడివి చిన్నదే అయినా మంచి ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్ర కావడం, ప్యాన్‌ ఇండియా సినిమా కావడంతో తో జక్కన్న ఆలియాభట్‌ను తీసుకున్నారు. ఎన్టీఆర్‌ జోడీగా ఒలివియా మోరిస్‌ నటిస్తుంది. దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్యాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌తోపాటు హాలీవుడ్‌ స్టార్స్‌ రే స్టీవెన్‌ సన్‌, అలిసన్‌ డూడీ తదితరులు నటిస్తున్నారు. 


Advertisement
Advertisement