Sep 25 2021 @ 10:25AM

ఆలియాపై ఆన్‌లైన్ దాడి... ఆపాలంటోన్న ఆన్‌స్క్రీన్ డాడీ...

ఆలియా భట్ ‘కన్యాదానం‘ వివాదంలో ఇరుక్కుంది. ఆమె చేసిన ఓ యాడ్ ఇప్పుడు ట్రోలింగ్‌కు కారణం అవుతోంది. ఆడపిల్ల వస్తువేం కాదు, దానం చేయటానికి, అనేది సదరు అడ్వర్టైజ్మెంట్ సారాంశం. యాడ్‌లో భాగంగా ఆలియా ‘కన్యాదాన్ కాదు కన్యామాన్‘ అనే డైలాగ్ చెబుతుంది. దాని వల్లే సొషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతోంది. ఆలియా హిందూ సంస్కృతిని కించపరిచిందంటూ కిట్టని వారు కిరికిరీ పెడుతున్నారు.


ఆలియా భట్‌కు ఆన్‌లైన్‌లో సెగ ఎదురుకావటంతో ఆమె ఆన్‌స్క్రీన్ తండ్రి అండగా నిలిచాడు. ప్రస్తుతం వివాదాస్పదమైన వీడియోలో ఆమెకు నాన్నగా నటించాడు బిజయ్ ఆనంద్. అయితే, ఆయన ఆలియా తప్పేం లేదంటున్నాడు. తను డైరెక్టర్ చెప్పమన్నట్టు చెప్పిందే తప్ప ఉద్దేశ్యపూర్వకంగా ఏమీ మాట్లాడలేదని వెనకేసుకొచ్చాడు. కాకపోతే, నటీనటులు దర్శకుడు చెప్పమన్నట్టే చెబుతారు. తమ స్వంతంగా ఏదీ మాట్లాడేయరు. ఈ విషయం ట్రోల్ చేసే వారికి తెలియదంటారా? అయినా ఆలియానే వారు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె స్టార్ కాబట్టి. కోట్లాది మంది ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలు ఫలానా మతం, కులం, సంప్రదాయం లేదా వర్గం గురించి కామెంట్ చేసే ముందు... కాస్త ఆలోచించి అడుగు ముందుకేస్తేనే ఎంతైనా మంచిది. లేదంటే కాంట్రవర్సీలు తప్పవు మరి!   


Bollywoodమరిన్ని...