రెండున్నర లక్షల ఖరీదైన బ్యాగ్‌తో...

ABN , First Publish Date - 2021-06-13T05:30:00+05:30 IST

సినిమా తారలు ధరించే దుస్తులు నుంచి బ్యాగుల వరకూ ప్రతిదాని గురించీ తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. కొన్నిసార్లు తారల దుస్తులు, చేతి గడియాలు, చెప్పుల ఖరీదు హాట్‌టాపిక్‌

రెండున్నర లక్షల ఖరీదైన బ్యాగ్‌తో...

సినిమా తారలు ధరించే దుస్తులు నుంచి బ్యాగుల వరకూ ప్రతిదాని గురించీ తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తారు. కొన్నిసార్లు తారల దుస్తులు, చేతి గడియాలు, చెప్పుల ఖరీదు హాట్‌టాపిక్‌ అవుతుంటాయి. ఇప్పుడు ఆలియా భట్‌ బ్యాగ్‌ వంతు వచ్చింది. దాని ఖరీదు రెండున్నర లక్షలు కావడంతో అందరూ నోరెళ్లబెడుతున్నారు. స్నేహితులతో కలిసి శనివారం ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు ఆలియా భట్‌. అప్పుడు తీసిన ఫొటో ఇది. అందులో ఆమె పట్టుకున్న బ్యాగ్‌ గురించే చెప్పుకొన్నది. గతంలో మాల్దీవులు వెళ్లినప్పుడు రెండున్నర లక్షల ఖరీదు కల బ్యాగ్‌ తీసుకువెళ్లారు. బహుశా... ఆలియా భట్‌ బ్యాగ్‌ కొనాలంటే కనీసం రెండున్నర లక్షలు ఉండాలేమో!

Updated Date - 2021-06-13T05:30:00+05:30 IST