‘కాఫీ విత్ కరణ్’ సీజన్ (Coffee with karan)7కు సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్లో అత్యంత ఆదరణ పొందుతున్న సెలబ్రిటీ టాక్ షో ఇది. నిర్మాత కరణ్ జోహార్ (karan johar)ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు బయటకు లాగడంలో ఆయన దిట్ట. అందుకే ఈ షోకు అంత క్రేజ్. ఈ నెల 7 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ప్రీమియర్ కానున్న ఫస్ట్ ఎపిసోడ్‌కు రణ్వీర్ సింగ్, ఆలియాభట్ (Aliabhatt)హాజరయ్యారు. కరణ్ అడిగిన ప్రశ్నలకు ఆలియా చురుకుగా సమాధానమిచ్చారు. అలాగే ఫస్ట్ నైట్ గురించి చెప్పిన డైలాగ్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. కొత్తగా పెళ్లైన ఆమెను ఫస్ట్ డెస్టినేషన్ గురించి కరణ్ అడిగారు. ‘‘ఫస్ట్ నైట్ అనేది ఏదీ ఉండదు. ఆ సమయానికి చాలా అలసిపోయి ఉంటాం’’ అని ఆలియా జవాబు ఇచ్చారు. ఇంకా ఎన్నో ప్రశ్నలకు ఆలియా, రణవీర్‌సింగ్ చలాకీగా జవాబులు చెప్పారు.