మూడోదశ సమర్థంగా ఎదుర్కోవాలి

ABN , First Publish Date - 2021-06-20T05:45:45+05:30 IST

కొవిడ్‌ మూడోదశలో ఒక్క మరణం కూడా చోటుచేసుకోకుండా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్ధమవ్వాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వైద్యవర్గాలకు పిలుపునిచ్చారు. మూడో దశలో చిన్నపిల్లలపై ఈ వైరస్‌ ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంచనాలు నేపథ్యంలో ఆ వైద్యవిభాగంలో పనిచేస్తున్న వారికి శనివారం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

మూడోదశ సమర్థంగా ఎదుర్కోవాలి
ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

-రిమ్స్‌ అధికారులతోకలెక్టర్‌ ప్రవీణ్‌కుమర్‌ సమావేశం

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 19 : కొవిడ్‌ మూడోదశలో ఒక్క మరణం కూడా చోటుచేసుకోకుండా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్ధమవ్వాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వైద్యవర్గాలకు పిలుపునిచ్చారు. మూడో దశలో చిన్నపిల్లలపై ఈ వైరస్‌ ఎక్కువ ప్రభావం చూపుతుందనే అంచనాలు నేపథ్యంలో ఆ వైద్యవిభాగంలో పనిచేస్తున్న వారికి శనివారం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  మూడోదశను తక్కువ అంచనా వేయవద్దన్నారు. అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. సమర్థవంతంగా చికిత్స అందించడానికి ఆస్పత్రుల సన్నద్ధత ఎంతో ముఖ్యమన్నారు. ఇందుకోసం అవసరమైన పడకలు, వెంటిలేటర్లు, ఇతర సదుపాయాలు సమకూర్చుకుని, తగినంతమంది వైద్యసిబ్బంది అందుబాటులో పెట్టుకోవడం ప్రధానమని కలెక్టర్‌ సూచించారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా నిర్వహించాలని వైద్యాధికారులకు దిశానిర్దేశం చేశారు. జేసీ టీఎ్‌సచేతన్‌ మాట్లాడుతూ మూడోదశలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వైద్యులు మరింత మానవీయ దృక్ఫథంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీరాములు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీకృష్ణారెడ్డి, ఆర్‌ఎంఓ డాక్టర్‌ వేణుగోపాలరెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఉషారాణి పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T05:45:45+05:30 IST