RRB Group D: అభ్యర్థులకు ముఖ్య గమనిక.. చివరి తేదీ ఈ నెల 26వరకే..!

ABN , First Publish Date - 2021-12-16T18:52:15+05:30 IST

గ్రూప్-డి పరీక్ష కోసం..

RRB Group D: అభ్యర్థులకు ముఖ్య గమనిక.. చివరి తేదీ ఈ నెల 26వరకే..!

ఇంటర్‌నెట్‌డెస్క్: గ్రూప్-డి పరీక్ష కోసం అప్లయ్‌ చేసిన అభ్యర్థులకు ముఖ్యగమనిక. దరఖాస్తులు తిరస్కరణకు గురైన అభ్యర్థుల కోసం దరఖాస్తు ఫారం ఎడిట్ చేసుకునే లింక్‌ను డిసెంబర్ 15న ఆర్ఆర్‌బీ విడుదల చేసింది. ఈ లింక్ డిసెంబర్ 26 వరకు ఓపెన్‌లో ఉంటుంది. https://rrbsecunderabad.nic.in/ లేదా ఇతర రీజినల్ వెబ్‌సైట్‌లలో ఈ లింకు అందుబాటులో ఉంటుంది.



అప్లికేషన్‌ను ఎలా అప్‌డేట్/ చెక్ చేసుకోవాలంటే.. 

అభ్యర్థులు ముందుగా ఏ జోన్‌కు అప్లయ్ చేశారో.. ఆ రీజియ‌న్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. సికింద్రాబాద్ రీజినయ‌న్‌కు చెందిన వారు https://rrbsecunderabad.nic.in/CEN-RRC-01-2019.html అనే లింక్‌ మీద క్లిక్ చేసి వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి. 


వెబ్‌సైట్‌లో అప్లికేష‌న్ స్టేట‌స్ చెక్ అండ్ అప్‌డేట్‌లోకి వెళ్లాలి.


అప్లికేష‌న్ ఆమోదం పొందితే మీరు ప‌రీక్ష రాయ‌డానికి అర్హులు. అప్లికేష‌న్ రిజెక్ట్ అని వస్తే.. Link For Modification లింక్ ఓపెన్ చేసి దరఖాస్తు పూర్తి చేయండి. ముఖ్యంగా ఫొటో, సంతకం అప్‌లోడ్ విషయంలో జాగ్రత్త వహించండి.



లింక్‌పై క్లిక్ చేసిన త‌రువాత Link for only check status అనే ఒక లింక్, Link for Modification అనే మరో లింక్ క‌న‌బ‌డ‌తాయి. అప్లికేషన్ రిజెక్ట్ అయ్యిందని మెసేజ్ వచ్చినవాళ్లు డైరెక్ట్‌గా Link for Modification అనే ఆప్ష‌న్‌‌ను ఎంచుకోండి. లేదంటే మొద‌టి లింక్ క్లిక్ చేసి మీ అప్లికేష‌న్ ఆమోదించారో లేదో తెలుసుకోండి. 


ఒకవేళ రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్ మ‌ర్చిపోతే.. Forgot Registration Number ఆప్ష‌న్‌పై క్లిక్‌చేసి మీ రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌ను తెలుసుకోండి. రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్ తెలుసుకొని అప్లికేష‌న్ స్టేట‌స్ చెక్ చేసుకోవాలి. 


Updated Date - 2021-12-16T18:52:15+05:30 IST