బంటుపల్లి గ్రామంలో ర్యాలీ చేపడుతున్నఅధికారులు
రణస్థలం: సీజనల్ జ్వరాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో బి.శైలజ అన్నారు. శనివారం బంటుపల్లి పంచాయతీలో పారిశుధ్య పనులు చేపట్టారు. తొలత గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, కాలువలు శుభ్రపరచు కోవాలని సూచించారు. వేడి ఆహారం, నీరు తీసుకోవడం మంచిదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నడుకుదిటి రజనిఈశ్వరరావు, ఏవో ధనుంజయరావు, పంచాయతీ కార్యదర్శి ఎల్.నాగరాజు పాల్గొన్నారు.