సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం

ABN , First Publish Date - 2022-07-06T04:39:32+05:30 IST

వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మలేరియా నివారణ జిల్లా అధికారిణి హుస్సేనమ్మ తెలిపారు

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం
కళాజాతా ద్వారా వ్యాధులపై ప్రచారం పాల్గొన్న అధికారులు

మలేరియా వైద్యాధికారి హుస్సేనమ్మ

కళాజాత ద్వారా వ్యాధులపై ప్రచారం 

నెల్లూరు (వైద్యం) జూలై 5 : వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మలేరియా నివారణ జిల్లా అధికారిణి హుస్సేనమ్మ తెలిపారు. మంగళవారం నగరంలోని కోలమిట్ట ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధులపై కళాజాతా ద్వారా ప్రచారం ప్రారంభించారు. పలు వ్యాధులపై అవగాహన కల్పిస్తూ కళాజాతాలు ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రస్తుత సీజన్‌లో ప్రబలే అవకాశం ఉందన్నారు. వ్యాధులకు కారకులైన దోమలను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మురికి నీటిలో దోమలు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లార్వా దశలోనే దోమలను నివారించేలా ప్రతి శుక్రవారం డ్రైడే పాటిస్తున్నామని వెల్లడించారు. టెంకాయ చిప్పలు, టైర్లు వంటి వాటిలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు.  దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మలేరియా, ఫైలేరియా సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T04:39:32+05:30 IST