ఒమైక్రాన్‌పై అలర్ట్‌

ABN , First Publish Date - 2021-12-05T07:18:04+05:30 IST

కరోనా వైరస్‌ ఒకటి, రెండో దశ నుంచి అంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒమైక్రాన్‌ మూడో ముప్పుగా విస్తరిస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల కరోనా పాటివ్‌ కేసుల సంఖ్య తగ్గడంతో ప్రజలంతా భౌతికదూరం, మాస్క్‌ ధరించ డం మరిచారు. మూడో ముప్పు నేపథ్యంలో మాస్క్‌ ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

ఒమైక్రాన్‌పై అలర్ట్‌
యాదగిరిగుట్ట పట్టణంలో మాస్క్‌లు ధరించనందుకు జరిమానాలు విధిస్తున్న పోలీసులు

ప్రజల్లో అవగాహనకు యంత్రాంగం చర్యలు

ప్రధాన కూడళ్లల్లో హోర్డింగ్‌లు, ప్లెక్సీలు ఏర్పాటు

మాస్క్‌ ధరించకుంటే ఫైన్‌


(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): కరోనా వైరస్‌ ఒకటి, రెండో దశ నుంచి అంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒమైక్రాన్‌ మూడో ముప్పుగా విస్తరిస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటీవల కరోనా పాటివ్‌ కేసుల సంఖ్య తగ్గడంతో ప్రజలంతా భౌతికదూరం, మాస్క్‌ ధరించ డం మరిచారు. మూడో ముప్పు నేపథ్యంలో మాస్క్‌ ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో మాస్క్‌ ధరించనివారికి పోలీసు లు జరిమానా విధిస్తున్నారు. అంతేగాక ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల౅ పౖ అధికార యంత్రాంగం అవగాహన కల్పిస్తోంది.


కొవిడ్‌ నేపథ్యంలో ఇప్పటికే పట్టణాలు, పల్లెల్లో హోర్డింగ్‌లు, ప్లెక్సీల ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ని 421 పం చాయతీలు, ఆరు మునిసిపాలిటీల్లోని ప్రధాన కూడ ళ్లు, బస్టాండ్ల వద్ద ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. విధి గా మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాల ని, జలుబు, తలనొప్పి, దగ్గు, జ్వరం తదితర లక్షాణ లు కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వీటి ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అంతేగాక మైకుల ద్వారా ఒమైక్రాన్‌పై అవగాహన కల్పించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. వైద్య, పం చాయతీశాఖ, మునిసిపల్‌శాఖల సిబ్బంది ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. అంతేగాక వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు.


మాస్క్‌ ధరించకుంటే జరిమానా

కరోనా రెండోదశ ప్రభావం తగ్గుముఖంపట్టాక చాలామంది ప్రధానంగా యువకులు మాస్క్‌ ధరించడంలేదు. ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసు లు నమోదవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌-19 నిబంధనలు కచ్చితంగా పాటించాలని, మాస్క్‌ ధరించనివారికి రూ.1000 జరిమానా విధించాలని ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పోలీసులు చౌరస్తాల వద్ద తనిఖీలు చేపట్టి మాస్క్‌ ధరించనివారికి జరిమానా విధిస్తున్నారు. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, చౌటుప్పల్‌, మోత్కురు, పోచంపల్లి పట్టణంతోపాటు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం పోలీసులు తనిఖీలు నిర్వహించిన జరిమానా విధిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన ఒక్కరోజే యాదగిరిగుట్ట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో 10 మందికి రూ.1000 చొప్పున పోలీసులు జరిమానా విధించారు.


మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి : డాక్టర్‌ సాంబశివరావు, డీఎంహెచ్‌వో

ఒమైక్రాన్‌ వేరియంట్‌ కేసు లు దేశంలో నమోదయ్యాయి. ఈ వైర్‌సపై అప్రమత్తంగా ఉండాలి. వైర్‌సబారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. అదేవిధంగా భౌతికదూరం పాటించడంతోపాటు చేతులను తరచుగా శానిటైజ్‌ చేసుకోవాలి. కొత్త వేరియంట్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కరోనా పాజిటివ్‌గా వచ్చిన బాధితులకోసం జిల్లాలోని మూడు ఏరియా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా పడకలు ఏర్పాటు చేశాం.


జాగ్రత్తలు పాటించాలి : సునంద, డీపీవో

కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌పై అంతా అప్రమత్తంగా ఉండాలి. ఈ మహమ్మారిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకు న్నాం. గ్రామాల్లో మైకుల ద్వారా ప్రచారం చేస్తు న్నాం. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు, పరిసరాల ను సైతం శుభ్రంగా ఉంచుకోవాలి.మాస్క్‌ ధరించాలి.


Updated Date - 2021-12-05T07:18:04+05:30 IST