ఒమైక్రాన్‌పై అలర్ట్‌

ABN , First Publish Date - 2021-12-05T07:08:47+05:30 IST

కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ కేసులు దేశంలో వెలుగు చేస్తుండటం తో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఒమైక్రాన్‌పై అలర్ట్‌

 మాస్క్‌ లేకుంటే జరిమానా విధిస్తున్న పోలీసులు

వచ్చే ఏప్రిల్‌ నాటికి రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే అవకాశం

బోధనా సిబ్బందికి యుద్ధప్రాతిపదికన రెండో డోస్‌

కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ కేసులు దేశంలో వెలుగు చేస్తుండటం తో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో మాస్క్‌ తప్పనిసరి చేయ గా, వాటిని ధరించకుంటే పోలీసులు రూ.1000 జరిమానా విధించడం ప్రారంభించారు. కొవిడ్‌ రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌పై వైద్యశాఖ దృష్టిసారించింది. అదేవిధంగా బోధనా సిబ్బందికి తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తిచేసేలా విద్యాశాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు.

- (ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ)

మాస్క్‌ తప్పనిసరి చేయడంతో పోలీ్‌సశాఖ రం గంలోకి దిగింది. మాస్క్‌లు ధరించని వారికి జరిమానా విధించడం ప్రారంభించింది. ఈ నెల 3వ తేదీ నుంచే పోలీసులు తనిఖీలు నిర్వహించి మాస్క్‌ ధరించనివారికి జరిమానా విధిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలి రోజే 200మందికి జరిమానా విధించారు. అయితే తొలుత ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలని, ఆ తరువాతే జరిమానా విధించాలని పోలీసులకు డీజీపీ కార్యాల యం నుంచి ఆదేశాలు ఉన్నాయి. కరోనా ప్రారంభం నుంచే కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడటంతోపాటు, వాటిని ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. రెండో దశ అనంత రం కేసులు తగ్గడంతో పోలీసులు చూసిచూడనట్లు వ్యవహరించారు. తాజాగా, ఒమైక్రాన్‌ అలజడి నేపథ్యంలో మళ్లీ నిబంధనలు తప్పనిసరిగా పాటించే లా కఠినంగా వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. అదేవిధంగా ప్రజలు అధికంగా గుమికూడకుండా సీసీ కెమెరాల ద్వారా నిఘాపెట్టారు. జ న సామర్థ్యం అధికంగా ఉండే ప్రాంతాలను పర్యవేక్షించేందుకు ఉమ్మడి జిల్లాలోని సబ్‌ డివిజన్ల వారీ గా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. మాస్క్‌ ధరించని వారిని గుర్తించి పోలీసులు రూ.1000 చలానా రాస్తే, ఆ మొత్తాన్ని మీ-సేవా కేంద్రాల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఇతర చలాన్లతో పాటు ఈ-ఫైన్‌ కూడా చూపిస్తుంది. వాటిని చెల్లిస్తేనే వాహనాన్ని వదిలేస్తారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో సుమారు 66,819 మాస్క్‌ ధరించని వారిపై కేసు నమోదు చేశారు. ఒక్క నల్లగొండ జిల్లాలో 36,718 కేసులు నమోదయ్యాయి.


రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌కు వైద్యశాఖ కసరత్తు

ఉమ్మడి జిల్లాలో 18ఏళ్ల పైబడిన వ్యాక్సిన్‌కు అర్హులైన వారు 25.70లక్షల మంది ఉన్నారు. కాగా, మొదటి డోస్‌ పూర్తి చేసుకున్న వారి సంఖ్య 22.39లక్షలు. రెండో డోస్‌ తీసుకున్నవారు 10.06లక్షల మంది ఉన్నారు. కాగా, మొదటి డోస్‌ తీసుకున్నవారు కొంత మంది నిర్లక్యంతో, కొంతమంది పలు కారణాలతో రెండో డోస్‌కు దూరంగా ఉన్నారు. దీంతో రెండో డోసు లక్ష్యం పూర్తికావడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ను వైద్యశాఖ వేగవంతంచేయనుంది. రెండో డోస్‌ లక్ష్యం వందశాతం పూర్తవ్వాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌ చివరి పడుతుందని వైద్యశాఖ సిబ్బంది చెబుతున్నారు. రెండో డోస్‌ గడువు సమీపించిన వారి వివరాలు వెంటనే సేకరించాలని వైద్యశాఖ అధికారులు కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మొదటి డోస్‌ తీకున్నవారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, వారి వివరాలు ఫోన్ల ద్వారా తెలుసుకోవడం, అది వీలుకాని పక్షంలో ఇళ్లకు వెళ్లి విచారించాలని వైద్యశాఖ అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.


విద్యాశాఖ అప్రమత్తం...

ఒమైక్రాన్‌ ఆందోళన ఓ వైపు ఉండగా, మరోవైపు విద్యా సంస్థల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తుండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. బోధనా సిబ్బందిలో అసలు టీకాలు వేసుకోనివారు, రెండవ డోస్‌ వేసుకోవాల్సిన వారి వివరాలను వైద్యశాఖ అధికారులు సేకరించారు. ఉమ్మడి జిల్లాలో మొదటి డోస్‌ వేసుకున్న ఉపాధ్యాయులు 98.2శాతం ఉండగా, రెండో డోస్‌ తీసుకున్నవారు 55శాతం మందే ఉన్నారు. ఇప్పటి వరకు టీకా వేసుకోని వారి సంఖ్య 510 మందిగా గుర్తించారు. వీరందరికి ప్రత్యేక క్యాంపు నిర్వహించి మొదటి, రెండో డోస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. స్థానికుల సహకారంతో విద్యార్థులకు మాస్క్‌లు అందజేయాలని, పాఠశాలల్లో భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు సూచించారు.


మాస్క్‌ ధరిస్తేనే రక్షణ : ఏవీ.రంగనాథ్‌, ఎస్పీ 

ఒమైక్రాన్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సాధారణ కరోనా కేసులు కూడా ఉన్నందున ప్రజలు మాస్క్‌ కచ్చితంగా ధరించాలి. భౌతికదూరం పాటించడంతో పాటు ఆరోగ్యరక్షణ చర్యలు తీసుకోవాలి. మాస్క్‌ ధరించని వారిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేస్తున్నాం. అంతా వ్యాక్సిన్‌ తీసుకోవాలి. పరిమిత సంఖ్యతో శుభకార్యాలు నిర్వహిస్తే మంచిది. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు మీదికి తెచ్చుకోవద్దు.


Updated Date - 2021-12-05T07:08:47+05:30 IST