Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒమిక్రాన్‌పై అప్రమత్తం

- ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు

- అందుబాటులో రెమ్‌డెసివర్స్‌

- జిల్లా ఆసుపత్రిలో అదనపు పడకలు

- చిన్నారులకు ప్రత్యేక వార్డులు

- నెలాఖరులోపు వంద శాతం వ్యాక్సినేషన్‌పై దృష్టి

జగిత్యాల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమి క్రాన్‌పై అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలకు ఇచ్చిన సూచనల మేరకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల ఆదేశాల మేరకు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖతో పాటు సంబంధిత శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కొవిడ్‌ రెండో దశ ము గిసే సమయానికి ఆసుపత్రుల్లో దాదాపు అన్ని వసతులు కల్పించారు. రానున్న కాలంలో మూడో దశ వచ్చినా సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు అధికార యం త్రాంగం అప్రమత్తమవుతున్నది. 

జిల్లాలో వైద్య ఆరోగ్య సేవల పరిస్థితి ...

జిల్లా కేంద్రంలో ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రితో పాటు 3 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 151 సబ్‌ సెంటర్లు, 5 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు పనిచేస్తున్నాయి. జిల్లాలో 24 గంటలు పనిచేసే ఆసుపత్రులు 9 ఉన్నాయి. 10 ఆర్‌బీఎస్‌కే బృందాలు, 104 వాహనాలు 6, 108 వాహనాలు 6 ఉన్నాయి. వివిధ ఆసుపత్రుల్లో 8 వెంటిలేటర్లు, 2 ఆక్సీనేటర్లు, జిల్లా కేంద్రంలో ఆక్సిజన్‌ ప్లాంట్‌, 4 ఐసోలేషన్‌ కేంద్రాలు, 2 ఐసోనేజల్‌ క్యానెల్‌లు అందుబాటులో ఉన్నాయి. 


ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు...

ఆక్సిజన్‌ కొరత ఏర్పడకుండా ఉండేందుకు జిల్లా కేంద్రంలోని దవా ఖానా ఆవరణలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. 246 పడక లకు రోజంతా సరఫరా చేసే విధంగా ప్లాంట్‌ ఏర్పరిచారు. ఒక వేళ కేసులు పెరిగినప్పటికీ కొరత ఏర్పడకుండా జాగ్త్రతలు తీసుకుంటున్నా రు. పలు ఆసుపత్రుల్లో 8 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. గతం లో కరోనా మొదటి వేవ్‌, రెండో వేవ్‌లో చోటుచేసుకున్న సంఘటనలు, అనుభవాలను పరిగణలోకి తీసుకొని అవసరమైన జాగ్రత్తలను అధికారు లు తీసుకుంటున్నారు. 


ఆసుపత్రుల్లో పెరిగిన పడకలు...

జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో పడకలను పెంచారు. పడకలను 70 నుంచి 100 వరకు పెంచుతూ ఏర్పాట్లు చేశారు. ఆక్సినేటర్లు, ఆక్సిజన్‌ ప్లాంట్‌ అందుబాటులోకి తెచ్చారు. ప్రతీ పీహెచ్‌సీలో 2, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో 5 ఆక్సినేటర్లను ఉంచారు. జిల్లా కేంద్రంలో సుమారు 200 వరకు రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు సిద్ధంగా ఉంచారు. అత్యవసరమైన చికిత్స అందించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలను అధికారులు తీసుకుంటున్నారు.


ఐసోలేషన్‌ కేంద్రాలపై దృష్టి...

జిల్లాలో కరోనా తొలి వేవ్‌, మలి వేవ్‌లలో పలు ప్రాంతాల్లో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిని మరింత మెరుగుపరచ డంతో పాటు అవసరమైతే సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నా రు. జిల్లాలోని జెఎన్‌టీయూ, పొలాస వ్యవసాయ కళాశాల, కోరుట్ల జూ నియర్‌ కళాశాల, మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పరిచారు. ప్రస్తుతం ప్రతీ గ్రామ పంచాయతీ, పాఠశాలల్లో అవసరమైన ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పరచడానికి ప్రయత్నిస్తున్నారు.


చిన్నారులపై ప్రత్యేక దృష్టి...

కరోనా విజృంభించి చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జా గ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో చిన్నా రులకు ప్రత్యేక వార్డును కేటాయించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక గదులు, సుమారు 30 బెడ్లు అందుబాటులో ఉంచారు. చిన్నారులకు చికి త్స అందించడానికి అవసరమైన ప్రత్యేక వైద్య నిపుణులను సైతం అందు బాటులో ఉంచుతున్నారు.


వంద శాతం వ్యాక్సినేషన్‌కు చర్యలు...

జిల్లాలో ఈనెలాఖరులోపు వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడాని కి అవసరమైన చర్యలను అధికార యంత్రాంగం తీసుకుంటోంది. జిల్లాలో 7,58,727 మందికి వ్యాక్సినేషన్‌ అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకు న్నారు. ఇప్పటివరకు 6,28,407 మంది తొలి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 2,69,652 మంది మలి డోసు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ను వేగవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 248 వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పరిచారు. పల్లె ప్రాంతాల్లో 200 ప్రత్యేక బృందాలు, పట్టణ ప్రాంతాల్లో 65 ప్రత్యేక బృందాలతో వ్యాక్సినేషన్‌ కా ర్యక్రమాన్ని చురుకుగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ రవి ఎప్పటికప్పుడు వ్యా క్సినేషన్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.


అప్రమత్తతే ఆయుధం అంటూ ప్రచారం..

కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండడమే అసలైన ఆయు ధమని వైద్య ఆరోగ్య శాఖ ప్రచారం చేస్తోంది. పౌరులందరూ విధిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు వినియో గించాలని సూచిస్తున్నారు. గుంపులు, గుంపులుగా సంచరించవద్దని ప్ర చారం చేస్తున్నారు. 


ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాము

- పుప్పాల శ్రీధర్‌, డీఎంహెచ్‌ఓ, జగిత్యాల

కరోనా విజృంబించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. థర్డ్‌ వేవ్‌ వచ్చినా అవసరమైన వైద్య సహాయం అందించడానికి అవసర మైన చర్యలు చేపడుతున్నాము. తొలివేవ్‌, మలి వేవ్‌లో చోటుచేసు కున్న సంఘటనలు, ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకుంటున్నాము. అప్రమత్తంగా ఉండడం వల్ల కరోనా వ్యాప్తి నివారించడానికి కృషి చేస్తున్నాము.


Advertisement
Advertisement