Alert: డిసెంబర్‌ 28 నుంచి పరీక్షలు

ABN , First Publish Date - 2021-11-11T15:33:05+05:30 IST

డిసెంబర్‌ 28 నుంచి..

Alert: డిసెంబర్‌ 28 నుంచి పరీక్షలు

హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు డిసెంబర్‌ 28 నుంచి నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓల్డ్‌ బ్యాచ్‌ మొదటి సంవత్సరం పరీక్షలు డిసెంబర్‌ 28 నుంచి 31 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు 2022 జనవరి 3 నుంచి 8 వరకు, మూడో సంవత్సరం పరీక్షలు జనవరి 17 నుంచి 22 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు తదితర వివరాలను www.braouonline.in వెబ్‌సైట్‌లో పొందవచ్చునని తెలిపారు. రిజిస్ర్టేషన్‌కు చివరి తేదీ డిసెంబర్‌ 2 అని పేర్కొన్నారు.  

Updated Date - 2021-11-11T15:33:05+05:30 IST