ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు మాయం

ABN , First Publish Date - 2021-08-02T06:03:02+05:30 IST

మండలంలో భూ ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకపోతోంది.

ప్రభుత్వ  భూమిలో హెచ్చరిక బోర్డు మాయం
కొండుపాలెం ప్రభుత్వ భూమిలో మాయమైన హెచ్చరిక బోర్డు

రెండు రోజుల్లోనే తొలగించిన ఆక్రమణదారులు


తుమ్మపాల, ఆగస్టు 1: మండలంలో భూ ఆక్రమణదారుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకపోతోంది. ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు సైతం మాయమవుతున్నాయి. కొండుపాలెం పంచాయతీ పరిధిలోని సర్వే నంబరు 188, 189లలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నట్టు ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వెలువడడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు, హుటాహుటిన ఆ  భూమిలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. బాధ్యులైన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలు కూడా చేశారు. ఇది జరిగిన రెండు రోజుల్లోనే హెచ్చరిక బోర్డులను ఆక్రమణదారులు మాయం చేశారు. అధికారుల అండదండలు ఉండడంతోనే ఆక్రమణదారులు మితిమీరిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై తహసీల్దార్‌కు సమాచారం అందించడంతో పాటు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఎంపీటీసీ మాజీ సభ్యుడు శెట్టి వెంకటరమణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 


Updated Date - 2021-08-02T06:03:02+05:30 IST