Aryanతో సెల్ఫీ...ఈ వ్యక్తి కోసం వేట

ABN , First Publish Date - 2021-10-14T14:34:09+05:30 IST

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ సీజర్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) స్వతంత్ర సాక్షుల్లో ఒకరైన కేపీ గోసవిపై పూణే పోలీసులు తాజాగా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు...

Aryanతో సెల్ఫీ...ఈ వ్యక్తి కోసం వేట

పూణే (మహారాష్ట్ర): క్రూయిజ్ షిప్ డ్రగ్స్ సీజర్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) స్వతంత్ర సాక్షుల్లో ఒకరైన కేపీ గోసవిపై పూణే పోలీసులు తాజాగా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.కేపీ గోసవి ఆర్యన్ ఖాన్ తో కలిసి సెల్ఫీ తీసుకున్నాడు. లుకౌట్ సర్క్యులర్ అనేది ఒక వ్యక్తి దేశం విడిచి వెళ్లకుండా నిరోధించే నోటీసు. ‘‘2018 లో ఫరస్ఖానా పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఛీటింగ్ కేసులో పరారీలో ఉన్న కేపీ గోసవిపై మేము లుకౌట్ సర్క్యులర్ నోటీసు జారీ చేశాం’’ అని పూణే పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా  చెప్పారు.క్రూయిజ్ షిప్ రైడ్, డ్రగ్స్ రికవరీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మంది స్వతంత్ర సాక్షుల్లో గోసవి ఒకరు. ఇందులో బాలీవుడ్ నటుడు షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఈ నెల ప్రారంభంలో అరెస్టయ్యారు.


మలేషియాలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పూణేకు చెందిన చిన్మయ్ దేశ్ ముఖ్ ను మోసం చేసినందుకు గోసవిపై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్మయ్ దేశ్ ముఖ్ నుంచి గోసవి రూ.3.09లక్షలు తీసుకొని ఉద్యోగం ఇవ్వలేదని, డబ్బు కూడా వాపసు చేయలేదని పూణే పోలీసులు చెప్పారు. చిన్మయ్ దేశ్ ముఖ్ ఫిర్యాదు మేర గోసవిపై 2018లో ఛీటింగ్, ఐటీ యాక్ట్ ల కింద కేసు నమోదు చేశామని పూణే పోలీసులు వివరించారు.


Updated Date - 2021-10-14T14:34:09+05:30 IST