అమరావతి: ఏపీలో గంజాయి, నాటుసారా, అక్రమ మద్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఏపీ సరిహద్దుల్లో వారం రోజులుగా పోలీసుల ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మద్యం రవాణాలో 235 కేసులు నమోదు చేశారు. 270 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 17 వేల లీటర్ల నాటుసారా పోలీసులు ధ్వంసం చేశారు. గంజాయి రవాణాలో 18 కేసులు నమోదు చేశారు.. 52 మంది అరెస్ట్ చేశారు. 1369 కేజీల గంజాయిని సీజ్ చేశారు. 262 మందిపై బైండోవర్ కేసులు పెట్టారు.
ఇవి కూడా చదవండి