Abn logo
Apr 10 2020 @ 05:42AM

మద్యం లూటీ!

ఇచ్చోడ మండలంలో జోరుగా బ్లాక్‌ అమ్మకాలు

సీజ్‌ చేసిన వైన్స్‌ నుంచి లిక్కర్‌ బాటిళ్ల మాయం

ఫోన్‌ఆర్డర్‌పై ఇంటికే సరఫరా 

మద్యం వ్యాపారులకు కాసుల పంట

గుడుంబా స్థావరాలపై దాడులతోనే సరిపెడుతున్న ఎక్సైజ్‌ అధికారులు


ఆదిలాబాద్‌, ఏప్రిల్‌9 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారితో జనమంతా బెంబేలెత్తిపోతున్నా మద్యం వ్యాపారులకు మాత్రం వరంగానే మారు తోంది. గత నెల 22న జనతా కర్ఫ్యూ నేపథ్యంలో జిల్లాలోని మద్యం దుకాణాలన్నింటినీ పూర్తిగా మూసివేశారు. ఆ మరుసటి రోజు నుంచే నిరంత రంగా లాక్‌డౌన్‌ను విధించడంతో జిల్లాలో మద్యం దొరకడమే గగనమై పోయింది. దీంతో మద్యానికి అలవాటు పడిన మందుబాబులు సుక్క కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుం టున్న కొందరు మద్యం వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా సీజ్‌ చేసిన వైన్‌ షాపుల నుంచి రాత్రికి రాత్రే మద్యాన్ని తరలిస్తూ బ్లాక్‌లో జోరుగా అమ్మ కాలు జరుపుతున్నారు. జిల్లాలో ఉన్న 31 మద్యం దుకాణాలు, 12 బార్‌ అండ్‌ రెస్టారెంట్‌, వందలాది బెల్ట్‌షాపులను మూసి వేసిన మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట పడడం లేదు.


దీంతో అడ్డదారి సంపా దనకు ఎగబడుతున్నారు. మంగళవారం రాత్రి ఇచ్చోడ మండలంలో ఓ వైన్‌షాపుసీల్‌ను ధ్వంసం చేసి మద్యాన్ని తరలించిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో మద్యం కోసం వ్యాపారులు ఏ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారో తెలుస్తునే ఉంది. అవకాశం ఉన్నప్పుడే నాలుగు పైసలు వెనుకేసుకోవాలనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. కరోనా వైరస్‌ నియం త్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికా రుల అలసత్వంతో లాక్‌డౌన్‌ స్పూర్తికి విఘాతం కలుగుతోంది. ఇప్పటికే ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన కొందరు నేతలు మద్యం అక్రమ అమ్మకాలపై అధికారులకు పిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు విన వస్తున్నాయి.


వైన్‌ షాపు సీల్‌ ధ్వంసం..

కరోనా నేపథ్యంలో మద్యం అమ్మకాలు జరపరాదని ఆదేశించిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు ముందు జాగ్రత్తగా జిల్లాలోని మద్యం షాపులను సీజ్‌ చేశారు. అయినా వ్యాపారులు ఏ మాత్రం వినకుండా అధికారులు వేసిన సీల్‌ను ధ్వంసం చేసి యథేచ్ఛగా మద్యం బాటిళ్లను తరలిస్తున్నారు. ఇచ్చోడ మండలంలోని ఓ వైన్‌ షాపు సీల్‌ ధ్వంసం కావడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. అధికారులు వేసిన పేపర్‌సీల్‌ను తొలగిం చిన వ్యాపారులు మద్యం షాపు నుంచి పూర్తిగా లిక్కర్‌ను తరలించి ఖాళీచేశారు. మళ్లీ యథావిధిగా తాళం వేయడంతో ఇది ఇంటి దొంగల పనేనని తెలుస్తోంది. ఒక వేళ ఎవరన్న గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడి ఉంటే తాళాన్ని పూర్తిగా ధ్వంసం చేసి వెళ్లి పోయే వారు.


అలా కాకుండా యథావిధిగా తాళం వేయడంపై ఇప్పటి వరకు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయక పోవడం సంబంధిత వైన్స్‌ యజమానే మద్యం లూటీకి పాల్పడి ఉంటాడని స్పష్టమవుతోంది. ఇచ్చోడలో మొత్తం 4 వైన్స్‌ సాపులు ఉండగా ఇందులో రెండు వైన్స్‌ షాపులు ఇప్పటికే ఖాళీ అయినట్లు తెలు స్తోంది. ప్రతి మద్యం దుకాణం ముందు సీసీ కెమెరాలు ఉన్నా అధికారులు ఏ మాత్రం పరిశీలిం చకుండా లక్కం సీల్‌తో తిరిగి సీల్‌ వేయడంపై విమర్శలు వస్తున్నాయి.


ఫోన్‌ ఆర్డర్‌పై సరఫరా..

లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడంతో వ్యాపారులు మద్యాన్ని నేరుగా విక్రయించకుండా దగ్గరి వ్యక్తుల ద్వారా ఫోన్‌ ఆర్డర్‌పై ఇంటికే సరఫరా చేస్తున్నారు. కానీ ధరలను పదింతలు పెంచి అమ్మడంతో మందుబాబుల జేబులకు చిల్లు లు పడుతున్నాయి. ఒక్కో క్వార్టర్‌ ధర రూ.500ల నుంచి రూ.600ల వరకు అమ్ముతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు తలమడుగు, తాంసి, ఇచ్చోడ మండలాల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతు న్నట్లు తెలుస్తోంది. ఎవరికి అనుమానం రాకుండా రహస్య ప్రదేశాలలో డంప్‌ చేస్తూ బ్లాక్‌లో విక్రయా లు జరుపుతున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో డంప్‌ చేసిన వ్యాపారులు అదును చూసి అమ్మేసు కుంటున్నారు.


గుడుంబా స్థావరాలపై దాడులతోనే సరి..

జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలలో ఉన్న మద్యం దుకాణాల గోల్‌మాల్‌ తీరును పసిగట్టని ఎక్సైజ్‌ అధికారులు కేవలం గుడుంబా స్థావరాలపైననే దాడులు చేస్తూ సరిపెడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఇచ్చోడ మండలంలోనే పలుమార్లు దాడులు చేసి నాటుసారా తయారీని ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మ కాలు చేస్తున్న బడావ్యాపారులపై మాత్రం చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. నిబంధనల ప్రకారం షాపులో ఉన్న స్టాక్‌ వివరాలను నమోదు చేయకుండానే సీజ్‌చేయడం, సీసీ కెమెరాల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


మద్యం దుకాణాలపై ప్రత్యేక దృష్టి.. రాజమౌళి

ఇచ్చోడ స్టేషన్‌ పరిధిలోని మద్యం దుకాణాల పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాం. ఇప్పటటికే మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఇచ్చోడ మండ లంలోని మద్యం దుకాణానికి మొదట వేసిన సీల్‌ను ఎవరు ధ్వంసం చేశారో తెలియదు. లాక్‌డౌన్‌ తర్వాత పరిశీలించి చర్యలు తీసు కుంటాం. దుకాణంలో ఎంత మద్యం స్టాక్‌ ఉం దనే విషయం రిజిస్టార్‌ ద్వారా తెలిసిపోతుంది. అలాగే సీసీ ఫుటేజీలను పరిశీలించి అక్రమ మద్యాన్ని అరికడుతాం. గుడుంబా తయారీని అడ్డుకునేందుకు తరచుగా దాడులు చేస్తున్నాం.

Advertisement
Advertisement