Abn logo
Sep 1 2021 @ 20:42PM

కృష్ణా జిల్లాలో మద్యం పట్టివేత

కృష్ణా: జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.  మైలవరం మండలం చంద్రాల గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని SEB పోలీసులు అరెస్ట్ చేసారు. అతని వద్ద నుంచి 30 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


మైలవరం మండలంలోని మొర్సుమిల్లిలో తెలంగాణ నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 75 మద్యం సీసాలను మైలవరం ఎస్ ఐ రాంబాబు స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న ఆటోను సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

క్రైమ్ మరిన్ని...