Advertisement
Advertisement
Abn logo
Advertisement

మద్యం పట్టివేత

 జోగులాంబ గద్వాల: జిల్లా గుండా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. ఆబ్కారీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు జిల్లా గుండా అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్టు ఆబ్కారీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో కెటి దొడ్డి మండలం నందిన్నె వాగు వద్ద  వాహనాల తనిఖీలు చేపట్టారు. వాగు వద్ద  కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న 2.50 లక్షల విలువ గల మద్యాన్ని ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు.


అలాగే మద్యాన్ని తరలించడానికి ఉపయోగించిన రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement