జూలై అధికారిక తాగుడు..రూ.154.5కోట్లు

ABN , First Publish Date - 2020-08-04T11:46:08+05:30 IST

జిల్లాలో వేలాదిమంది కరోనా వైరస్‌కు గురవుతున్నారు. వారిలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్న ..

జూలై అధికారిక తాగుడు..రూ.154.5కోట్లు

ఇంకా నాటుసారా ఎన్ని కోట్లో?

ఇతర ప్రాంతాల మద్యం ఎంతో?

రాత్రి 8గంటల వరకూ అమ్మకాలు

తర్వాత కూడా అన్నధికారిక విక్రయాలు

తర్వాత కూడా అన్నధికారిక విక్రయాలు

కొందరు వైసీపీ కార్యకర్తల సైడ్‌ బిజినిస్‌


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేలాదిమంది కరోనా వైరస్‌కు గురవుతున్నారు. వారిలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్న ఘటనలున్నాయి. కానీ చాలామంది మద్యం తాగడం మానడం లేదు. రకరకాల కొత్త బ్రాండ్లు.. నాణ్యత కూడా సరిగ్గా లేదనే ఆరోపణలున్నాయి. అయినా మద్యం తాగడం మానడం లేదు. మద్యనిషేధం కోసం క్రమంగా షాపులు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా, తాగడం మానట్లేదు. ధరలు పెంచేసినా తాగడం ఆగడం లేదు. 


జూలై1 నుంచి 31 వరకూ జిల్లాలో రూ.154.5కోట్ల విలువైన మద్యం తాగేశారు. జిల్లాలో గతంలో కంటే షాపులు తగ్గినా మద్యం సరఫరా చేసే డిపోలు తగ్గలేదు. జిల్లాలో రాజమహేంద్రవరం,  సామర్లకోట, అమలాపురంలో ఏపీబీసీఎల్‌ డిపోలు ఉన్నాయి. రాజమహేంద్రవరండిపో పరిధిలో  కేవలం జూలై నెలలో రూ.50కోట్ల86లక్షల 73వేల 740 విలువైన మద్యం తాగేశారు. అమలాపురం పరిధిలో రూ.53కోట్ల 79లక్షల61వేల630 విలువైన మద్యం, సామర్లకోట పరిధిలో  రూ.49కోట్ల 81లక్షల 29వేల 980 విలువ మద్యం తాగేశారు. ఇలా జిల్లాలో మొత్తం రూ.15కోట్ల47లక్షల65వేల350 మద్యం తాగేశారు. గతంలో సామర్లకోట పరిధిలో ఎక్కువ అమ్మకాలు ఉండేవి. తర్వాత స్థానం రాజమహేంద్రవరానికి వచ్చేది. అమలాపురం మూడో స్థానంలో ఉంది. కానీ జూలై మొదటిస్థానానికి వచ్చింది. ఇది కేవలం అధికారికంగా ప్రభుత్వం అమ్మిన మద్యం విలువ. ఇక నాటుసారా పరవళ్లు తొక్కుతోంది. అది ప్రభుత్వ మద్యం కంటే బాగా చౌక.కానీ అది కూడా రూ.కోట్లలోనే ఉండవచ్చు. తెలంగాణ వంటి ప్రాంతాలనుంచి వచ్చే మద్యం కూడా వస్తోంది.


అప్పుడప్పుడూ పట్టుకున్నప్పుడు రూ.లక్షల విలువైన మద్యమే దొరుకుతోంది. ఇక ఉదయం 11గంటలనుంచి రాత్రి 8గంటల వరకూ మద్యం అమ్మినా, కొందరు క్యూలో ఉండకుండా వేరే వాళ్ల దగ్గర అధిక ధరలకు కొనుగోలు చేసి తాగడం గమనార్హం. జిల్లాలో పలుచోట్ల వైసీపీ కార్యకర్తలు కొందరు ప్రభుత్వ దుకాణాల్లో మద్యం కొని రాత్రి వేళల్లో కొందరికి అధిక ధరలకు అమ్ముతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం పి.గన్నవరం మండలం నాగుల్లంకలో ఇలా జరుగుతుండగానే అధికారులు పట్టుకున్నారు. ఇవాళ అనేక ప్రాంతాల్లో బహిరంగంగానే మద్యం తాగేస్తున్నారు.

Updated Date - 2020-08-04T11:46:08+05:30 IST