మద్యం ఏరులే!

ABN , First Publish Date - 2020-06-01T09:33:11+05:30 IST

ఓ వైపు అక్రమ మద్యం.. మరోవైపు సారా.. జిల్లాలో ఏరులై పారుతోంది.

మద్యం ఏరులే!

గుంటూరు, మే 31: ఓ వైపు అక్రమ మద్యం.. మరోవైపు సారా.. జిల్లాలో ఏరులై పారుతోంది. పట్టుబడుతున్న మద్యం తక్కు వేనని.. అంతకంటే ఎక్కువే ప్రజల్లోకి వెళుతున్నట్లు ఆరో పణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు పోలీసులు ఇప్పటివరకు పెద్దఎత్తున అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనేకమందిపై కేసులు పెట్టి అరె స్టులు చేశారు. పెద్దఎత్తున బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. పటు ్టబడుతోన్న మద్యంతో పాటు వాహనాలను కూడా సీజ్‌ చేసు ్తన్నారు. డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ, రూరల్‌ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో అదనపు ఎస్పీలు కరిముల్లా షరీఫ్‌, ఆరిఫ్‌ హఫీజ్‌లు నిరంతరం తమ సిబ్బందితో దాడులు చేస్తున్నారు. 

 

అసలు కారణాలివీ..

లాక్‌డౌన్‌తో అత్యధిక దుకా ణాలు తెరుచుకోకపోవడం, మద్యం ధరలు ఆకాశాన్నంటడం, ప్రజలకు అవసరమైన, అలవాటుపడిన బ్రాండ్స్‌ లేకపోవడం, తెలంగాణలో ధరలు తక్కువగా ఉండటం తదితర కారణాలతో అక్రమ మ ద్యం జిల్లాలోకి విపరీతంగా వస్తు న్నట్లు స్పష్టమవుతోంది. జిల్లాకు తెలంగాణ రాష్ట్రం సరిహద్దు కావడంతో గుట్టుగా జిల్లాలోకి మద్యం దిగుమతి అవుతోంది. 


విస్తృతంగా తనిఖీలు

లాక్‌డౌన్‌తో జిల్లా, రాష్ట్ర సరిహ ద్దులు మూసివేయడం, అనుమతి ఉన్న వాహనాలను సైతం తనిఖీలు చేస్తుం డటంతో కొంతవరకు అక్రమ మద్యానికి అడ్డుకట్ట పడు తోంది. పోలీసులు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, ఇటీవలే ఏర్పాటైనప్పటికీ ఎల్‌అండ్‌ఓ పోలీసులు, ఎక్సైజ్‌ విభాగాలను సమన్వయం చేసుకుంటూ దాడులు ము మ్మరం చేసింది. ఇంతకాలం అక్రమ మ ద్యం వ్యవహారంతో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించిన పోలీసులు రంగంలోకి దిగడంతో మాఫియా ఉక్కిరిబిక్కిరిఅవుతోంది. అదే సమయం లో ఈ వ్యాపారంలోకి సామాన్యులు సైతం అడుగుపెట్టడంతో నిఘావర్గాలు సైతం పసిగట్టలేని పరిస్థితి నెలకొంది.  

 

విచ్చలవిడిగా సారా బట్టీలు

లాక్‌డౌన్‌తో పనులు లేక ఇబ్బం దులు పడుతున్న సమయంలో మద్యం ధరలు పెంచడంతో పేద వర్గాలు చాలామంది సారాకు అలవాటుపడ్డారు. పల్నాడే గాక డెల్టా ప్రాంతంలోనూ సారా కుటీర పరిశ్రమను తల పించేలా బట్టీలు వెలుస్తున్నాయి. గతంలో లీటర్‌ రూ.500 ఽధర పలికిన సారా ప్రస్తుతం లీటర్‌ రూ.1,200గా విక్రయిస్తున్నారు.    ప్రస్తుత పరి స్థితుల్లో కల్తీసారా.. నకిలీ మద్యం సరఫరా అవుతుందేమోననే స్వరత్రా ప్రజల్లో  భయాందోళనలు వ్యక్తమ వుతున్నాయి. 


జిల్లా వ్యాప్తంగా బారీగా..మద్యం పట్టివేత

ఎస్‌ఈబీ ప్రారంబించినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున మద్యం పట్టుకున్నారు. దీనిలో బాగంగా అర్బన్‌లో ఎస్‌ఈబీ అధికారులు 18 కేసులు నమోదు చేసి 34 మందిని అరెస్ట్‌ చేసి 9 వాహనాలు సీజ్‌ చేశారు. 24.2 లీటర్లు కలిగిన 296 బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎక్సైజ్‌ అధికారులు 19 మందిని అరెస్ట్‌ చేసి, 35 కేసులు నమోదుచేసి 10 వాహనాలు సీజ్‌ చేశారు. వారి నుంచి 16.75 లీటర్ల నాటుసారా, ఇతర రాష్ట్రాలకు చెందిన 115.04 లీటర్ల మద్యం సీజ్‌ చేశారు. 38.93 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.


రూరల్‌ జిల్లా పరిధిలో...

 ఇప్పటి వరకు 130 కేసులు నమోదు చేసి 235 మందిని అరెస్ట్‌ చేసి 58 వాహనాలను సీజ్‌ చేసి, 9,337 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 230 లీటర్ల నాటుసారా సీజ్‌చేశారు. వారి నుంచి రూ.9 లక్షల 72 వేల 522 నగదు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-06-01T09:33:11+05:30 IST