ఆటోలో తరలిస్తున్న మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-05-31T10:07:56+05:30 IST

ఆటోలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యంను శనివారం పట్టుకున్నారు. పాతకొండేపల్లికి చెందిన కె.శేషమ్మ,

ఆటోలో తరలిస్తున్న మద్యం పట్టివేత

ఎటపాక, మే 30 : ఆటోలో  అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యంను శనివారం పట్టుకున్నారు. పాతకొండేపల్లికి చెందిన కె.శేషమ్మ, కారం భద్రయ్య ఆటోలో భద్రాచలం నుంచి మద్యంను పాతకొండేపల్లి గ్రామానికి తరలిస్తున్న క్రమంలో శ్రీరామ్‌నగర్‌ కాలనీ వద్ద పోలీసులు పట్టుకున్నారు.  మద్యం విలువ రూ.7,000 ఉంటుందని ఎస్‌ఐ సాగర్‌ తెలిపారు. ఆటోను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-05-31T10:07:56+05:30 IST