స్వయం ఉపాధి యూనిట్ల ఎంపికలో రసాభాస

ABN , First Publish Date - 2021-09-09T01:02:45+05:30 IST

జిల్లాలోని కుల్కచర్లలో జరిగిన ఎస్టీ కార్పొరేషన్ స్వయం ఉపాధి యూనిట్ల ఎంపికలో

స్వయం ఉపాధి యూనిట్ల ఎంపికలో రసాభాస

వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్లలో జరిగిన ఎస్టీ కార్పొరేషన్ స్వయం ఉపాధి యూనిట్ల ఎంపికలో రసాభాస చోటుచేసుకుంది. తమకు వేరుగా డ్రా తీయాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు చెంచులు నిరసన తెలిపారు. అధికారులు ఓకే చెప్పడంతో చెంచులు నిరసన విరమించారు. వేరుగా ఎంపిక ఎలా చేస్తారని ఎస్టీ దరఖాస్తుదారులు ఆందోళన చేశారు. చెంచులు, ఎస్టీలు వేర్వేరు కాదంటూ అధికారులతో ఎస్టీ దరఖాస్తుదారులు వాగ్వాదం పెట్టుకున్నారు. దీంతో ఎంపిక ప్రక్రియను అధికారులు ఆపేసారు. ఎంపిక తేదీని మార్చి, అందరిని అక్కడినుంచి పోలీసులు  పంపించి వేసారు.  

Updated Date - 2021-09-09T01:02:45+05:30 IST