Advertisement
Advertisement
Abn logo
Advertisement

అలసత్వం వీడకుంటే.. ఇంటికే!

 జిల్లా పంచాయతీ  అధికారి హెచ్చరిక

కోట, డిసెంబరు 4 : ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగుల అలసత్వాన్ని సహించాం. ఇకనైనా మార్పు రాకపోతే ఇళ్లకు పంపుతామని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి హెచ్చరిం చారు. కోట, దాదరాయిగుంటల్లో శవాఆరం ఆమె మురుగు కాలువలను పరిశీలించారు. గ్రామాల్లో బ్లీచింగ్‌ చల్లినంతమాత్రాన రోగాలు రావనుకుంటే అది పోరపాటే అన్నారు. ప్రభుత్వం నుంచి నెలనెల జీతాలు తీసుకుంటున్నారు. ఆ డబ్బు చెట్లకు కాస్తోందా అని ప్రశ్నించారు. తప్పించుకుని తిరగాలని చూస్తే విధుల నుంచి తొలగిస్తామన్నారు. ప్రతి రోజు సచివాలయాలలో స్పందన కార్యక్ర మం నిర్వహించాలన్నారు. సచివాలయాల ఆవశ్యకతను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ఓటీఎస్‌ తది తర పథకాల లక్ష్య సాధనపై  నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారు ణమన్నారు.  చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాల పనితీరు దారుణంగా ఉందన్నారు.  అనంతరం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో  కోఆర్డినేటర్‌ శ్రీనివాసులురెడ్డి, డీఎల్‌పీవో వెంకట రమణ, ఎంపీడీవో భవాని, ఈవోపీఆర్‌డీ స్వరూపారాణిలు వివిధ అంశాలను సమీక్షించారు.

Advertisement
Advertisement