Abn logo
Feb 24 2021 @ 20:11PM

కల్యాణ్‌ దేవ్ వదిలిన ‘అలాంటి సిత్రాలు’ ఫస్ట్ లుక్

‘అలాంటి సిత్రాలు’ మూవీ ఫస్ట్‌ లుక్‌ని మెగా హీరో కల్యాణ్‌ దేవ్‌ విడుదల చేశారు. ఐ అండ్‌ ఐ ఆర్ట్స్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్ నిర్మాణంలో.. అన్నపూర్ణ ఫిలిం స్కూల్ లో స్క్రిప్ట్ అండ్‌ డైరెక్షన్  కోర్స్ లో మాస్టర్స్ పూర్తి చేసి పూరి జగన్నాధ్ వద్ద రచనా విభాగంలో పనిచేసిన సుప్రీత్. సి. కృష్ణ దర్శకత్వంలో, రాహుల్ రెడ్డి నిర్మాతగా.. కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'అలాంటి సిత్రాలు'. నలుగురు భిన్న వ్యక్తుల విభిన్న జీవితాలు, అనుకోకుండా ఒకరి దారిలో మరొకరు తారసపడినప్పుడు వారి జీవిత గమనంలో  చోటుచేసుకున్న అనూహ్యపరిణామాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా మేకర్స్‌ తెలుపుతున్నారు.


ఫస్ట్‌ లుక్‌ విడుదల అనంతరం.. ''ఒక మంచి కాన్సెప్ట్‌తో యువ దర్శకుడు తన తొలి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇటువంటి చిత్రాలు మరిన్ని రావాలి. కొత్త  దర్శకుల్ని మనం  ప్రోత్సహించాలి" అని హీరో కల్యాణ్ దేవ్ తెలుపగా సమర్పకుడు కె.రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ తుది దశలో వుంది. మార్చి ఆఖరివారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఫస్ట్‌ లుక్‌ వదిలిన కల్యాణ్‌ దేవ్‌గారికి చిత్రయూనిట్‌ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.. అని అన్నారు.

Advertisement
Advertisement
Advertisement